MSG Movie Review: ‘మన శంకరవరప్రసాద్ గారు’.. ఫుల్ రివ్యూ
mana sankara varaprasad review
ఎంటర్‌టైన్‌మెంట్

MSG Movie Review: సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను నవ్వించారా?.. ఫుల్ రివ్యూ..

మూవీ : మన శంకరవరప్రసాద్ గారు

నటీనటులు: చిరంజీవి, నయనతార, వెంకటేష్, కాథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు..

దర్శకత్వం: అనిల్ రావిపూడి

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల

విడుదల: జనవరి 12, 2026

MSG Movie Review: మెగాస్టార్ నుంచి సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది పండక్కే ఆయన సినిమా వస్తుందంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి. అంతటి హైప్ తో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మెగాస్టార్ కు ఎంత వరకూ కలిసి వచ్చింది. ఈ సంక్రాంతి కూడా తనదే అంటున్న అనిల్ రావిపూడి హిట్ కొట్టాడా అన్న పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Nari Nari Naduma Murari Trailer: ఒక హీరో, రెండు లవ్ స్టోరీస్.. పరిష్కారం లేని సమస్య!

కథా నేపథ్యం

శంకర వర ప్రసాద్ (చిరంజీవి) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)లో ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్. వృత్తిరీత్యా ఎంతో కఠినంగా ఉండే ఆయన, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒక ‘డైవర్సీ’. భారతదేశపు అత్యంత ధనిక వ్యాపారవేత్త శశిరేఖ (నయనతార)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రసాద్, మనస్పర్థల వల్ల ఆమెకు దూరమవుతాడు. తన పిల్లలను అమితంగా ఇష్టపడే ప్రసాద్, తన కుటుంబాన్ని మళ్ళీ ఎలా కలుపుకున్నాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ

అనిల్ రావిపూడి తన గత చిత్రాల తరహాలోనే ఈ సినిమాను కూడా పూర్తిస్థాయి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మలిచారు. ముఖ్యంగా మెగాస్టార్‌లోని ‘వింటేజ్’ కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, ముఖ్యంగా ‘శశిరేఖ’ సాంగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. నిడివి 2 గంటల 44 నిమిషాలు ఉన్నప్పటికీ, ఎడిటింగ్ షార్ప్‌గా ఉండటంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగంగా సాగిపోయే కథనం, కామెడీ సీన్లు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ద్వితీయార్థంలో కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. విలన్ పాత్ర క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం రొటీన్‌గా అనిపిస్తాయి.

Read also-Prabhas RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఫైట్ సీక్వెన్స్‌ యాడ్ చేశారు.. ఈ ప్రోమో చూశారా?

ఎలా చేశారంటే..

చిరంజీవి ఎనర్జీ, మేనరిజమ్స్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన బలం. వింటేజ్ మెగాస్టార్ ను అనిల్ రావిపూడి మళ్లీ మనకు పరిచయం చేశారు. చాలా కాలం తర్వాత చిరును ఇంత సరదాగా చూడటం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. శశిరేఖ పాత్రలో నయనతార హుందాగా నటించారు. చిరంజీవికి, ఆమెకు మధ్య వచ్చే మనస్పర్థల సన్నివేశాలు మెచ్యూర్డ్ లవ్ ట్రాక్ బాగా కుదిరింది. సినిమా రెండో సగంలో వచ్చే వెంకటేష్ పాత్ర కేవలం ఒక అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రగా ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే ‘కామెడీ’ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కాథరిన్ థ్రెసా గ్లామర్ పరంగా మెప్పించగా, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్ తమదైన శైలిలో నవ్వులు పూయించారు.

బలాలు

మెగాస్టార్, వెంకటేష్

కామెడీ

సంగీతం

అనిల్ రావిపూడి టేకింగ్

బలహీనతలు

సెకండాఫ్ కొన్నిసన్నివేశాలు

ప్రిడిక్టబుల్ స్టోరీ

రేటింగ్ – 3 / 5

Just In

01

Kesamudram Municipality: కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో.. మొట్టమొదటి పట్టం ఎవరికో..?

Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం

MSG Movie Review: సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను నవ్వించారా?.. ఫుల్ రివ్యూ..

Mahabubabad Police: మహబూబాబాద్‌లో.. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!