BB JODI Season 2: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9)లో రెండు జంటలు బాగా హైలెట్ అయిన విషయం తెలిసిందే. అందులో ఒక జంట కళ్యాణ్ పడాల (Kalyan Padala), తనూజ (Tanuja) కాగా, రెండో జంట రీతూ (Rithu) అండ్ డిమోన్ పవన్ (Demon Pavan). కళ్యాణ్, తనూజ కాస్త కంట్రోల్‌గా ఉన్నారు కానీ.. రీతూ అండ్ డిమోన్ మాత్రం వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే ఫీల్‌ని ఈ షో చూస్తున్న అందరికీ ఇచ్చారు. రీతూ ఎలిమినేటైన తర్వాత డిమోన్ కొన్ని రోజులు చాలా డల్‌గా ఉన్నారు. సూట్‌కేస్‌తో డిమోన్ పవన్ హౌస్ నుంచి వెనుదిరిగినప్పుడు కూడా రీతూ గురించే మాట్లాడాడు. వాళ్లిద్దరి మధ్య అంత బాండింగ్ నడుస్తుంది. కచ్చితంగా వీళ్లు హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా అదే బాండింగ్ కంటిన్యూ చేస్తారా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. డౌటే లేదు.. వాళ్లిద్దరి మధ్య ఆ బాండింగ్ నడుస్తూనే ఉంది. అందుకు సాక్ష్యమే.. ‘బిగ్ బాస్’ తర్వాత నుంచి ప్రసారం అవుతున్న ‘బీబీ జోడి’.
Also Read- Anil Ravipudi: మెగా ఫాన్స్ నన్ను లాక్కెళ్ళి ముద్దు పెట్టాలని చూశారు
బ్లాక్ బస్టర్ థీమ్
అవును, ‘బీజీ జోడి సీజన్ 2’ (BB JODI Season 2)లోకి వాళ్లిద్దరు కూడా ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభ ఎపిసోడ్స్‌లో వాళ్లు లేరు కానీ, ఇప్పుడా జంట కూడా యాడయ్యారు. త్వరలో కళ్యాణ్, తనూజ జంట కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇక బీబీ జోడిలో డిమోన్, రీతూ ఎంట్రీకి సంబంధించి స్టార్ మా ఓ ప్రోమో వదిలింది. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రోమోని గమనిస్తే.. ఈ వారం బ్లాక్ బస్టర్ థీమ్ అంటూ హోస్ట్ ప్రదీప్ చెబుతున్నారు. ఈ థీమ్‌లో శేఖర్ మాస్టర్ మరో ఇద్దరు జడ్జిలైన శ్రీదేవి, సదాలతో మాస్ ఎంట్రీ ఇచ్చారు. మంచి డ్యాన్స్ సాంగ్‌తో అలరించిన వారు.. కాసేపు స్టేజ్‌పై కామెడీ చేశారు. ఇక తాజాగా థియేటర్లలోకి వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీలోని హుక్ స్టెప్ పాట ప్లే అవుతుండగా, కంటెస్టెంట్ల డ్యాన్స్ మూమెంట్స్‌ని పరిచయం చేశారు. ఆ వెంటనే ఈ బ్లాక్ బస్టర్ థీమ్‌లో ఓ బ్లాక్ బస్టర్ జోడీ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పగానే.. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని రీతూ, పవన్ ఎంట్రీ ఇచ్చారు.
Also Read- Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?
బాబోయ్.. ఇదేం కెమిస్ట్రీ!
ఇక రాగానే రీతూ గురువులకు నమస్కారాలు అని కామెడీ స్టార్ట్ చేసింది. బిగ్ బాస్ అయిపోతుందని కొంచెం బాధపడ్డా.. కానీ బీబీ జోడికి వచ్చాను కాబట్టి, కుదిరితే టైటిల్, లేదంటే అని డిమోన్ అనగానే.. వెంటనే ప్రదీప్ అందుకుని, ‘ఇందులో సూట్‌కేస్‌లు, షేరింగ్‌లు ఏమీ ఉండవు’ అంటూ పంచ్ వేశారు. ఇక బిగ్ బాస్ తరహాలో ఓ టాస్క్ నిర్వహించిన అనంతరం సీరియస్‌నెస్ తీసుకొచ్చారు. కట్ చేస్తే.. డిమోన్, రీతూ ఓ హాట్ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తున్నారు. ‘మిరపకాయ్’ సినిమాలోని ‘గది తలపుల గడియలు బిగిసెను చూసుకో’ అనే సాంగ్‌కి వాళ్లిద్దరూ బీభత్సమైన కెమిస్ట్రీని ప్రదర్శించారు. ఈ కెమిస్ట్రీకి జడ్జిలు కూడా షాకయ్యారు. ‘మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని అనుకున్నాం కానీ, వాళ్లు చెప్పింది చాలా తక్కువ అని మీ పెర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైంది’ అని శేఖర్ మాస్టర్ అన్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ జంట కుమ్మేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ జంట ఎంట్రీతో ఈసారి ‘బీబీ జోడి’ సీజన్ కూడా టాప్‌లో దూసుకెళుతుందని డిమోన్, రీతూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

