మూవీ: అనగనగా ఒక రాజు
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, చమ్మక్ చంద్ర, మహేశ్ తదితరులు
దర్శకత్వం: మారి
నిర్మాత: నాగవంశీ, సాయి సౌజన్య
సినిమాటోగ్రఫీ: యువరాజ్
సంగీతం: మిక్కీ జే మేయర్
ఎడిటింగ్: వంశీ అట్లూరి
విడుదల: జనవరి 14, 2026.
Anaganaga Oka Raju Review: జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను బాగా నవ్వించిన నవీన్ పొలిశెట్టి.. ఈ సంక్రాంతికి మరో సారి ప్రేక్షకులను నవ్వించడానికి అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ మెప్పించింది. ట్రైలర్ లో చూపించిన కామెడీ సినిమాలో పండిందా?.. కొంత గ్యాప్ తర్వాత వస్తున్న నవీన్ పొలిశెట్టికి ఈ సినిమా ఎంతవరకూ కలిసొచ్చింది అన్నది ఈ రివ్యూ లో చూద్దాం.
Read also-Anil Ravipudi: మెగాస్టార్ సినిమాలో ఇళయరాజా సాంగ్ వాడినా కేసు ఎందుకు వేయలేదంటే?..
కథాంశం
గౌరవపుకానికి చెందిన జమీందార్ గోపరాజు మనవడే రాజు (నవీన్ పొలిశెట్టి). తాత కాలంలో ఉన్నా ప్రస్తుతం ఆస్తులు పోయి.. పేరు మాత్రమే మిగులు తోంది. దీంతో రాజు ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ, పగటి కలలు కంటూ కాలం గడుపుతుంటాడు. రాజేద్రప్రసాద్ సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో లాగా ఇందులో కూడా హీరో ఓవర్ నైట్ లో డబ్బున్న వాడిలా మారిపోవాలనుకుంటాడు. దాని కోసం డబ్బు ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆమె ఆస్త తనకు వస్తుందన్న బ్రమలో భ్రతుకుతుంటాడు. అనుకోకుండా చారులత (మీనాక్షి చౌదరి)ని చూశాక ఆమే తన రాణి అయితే కష్టాలన్నీ తీరిపోతాయని భావించి, ఆమెను ప్రేమలో పడేయడానికి రంగంలోకి దిగుతాడు. మరి చారులత మనసుని ఎలా గెలిచాడు? ఆమె జీవితంలోకి వచ్చాక రాజు కష్టాలు తొలగిపోయాయా? అసలు రాజు రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
ప్రతి సీజన్ లో సంక్రాంతికి వచ్చే సినిమా కథ లాంటిదే ఇది. కథ, కథనం, పాత్రలు… ఇలా అన్ని ఎక్కడో చూసిన అనుభూతిని కలిగిస్తాయి. ట్రైలర్ లో చూసినట్లుగా రాజు పాత్ర చేసే హంగామా మామలుగా ఉండదు. నవీన్ పొలిశెట్టి తన మార్క్ టైమింగ్‌ని ప్రదర్శిస్తూ, వన్ మేన్ షోలా సినిమాని ముందుకు నడిపించాడు. మాటలే ఈ సినిమాకి ప్రధానబలంగా చెప్పుకోవచ్చు. నవీన్ పొలిశెట్టి స్వయంగా తన పాత్ర ఏం చేయాలో తనే రాసుకుంటారు. దీంతో మాటలు చాలా పదునుగా వస్తాయి. తన వద్దకు సాయం కోసం వచ్చే జనాల కష్టాల్ని వింటూ, హీరో రాజు పడే పాట్లతో సినిమా ముందుకు సాగుతుంది. పెళ్లిలో శపథం, డబ్బున్న అమ్మాయిల కోసం రాజు చేసే ప్రయత్నాలు, ఆపరేషన్ చారులత ఎపిసోడ్స్ మొదలయ్యాకే అసలు సినిమా మొదలవుతుంది. భీమవరం బాల్మ, రాజుగారి పెళ్లిరో పాటలు సినిమాకి మరింత ఊపుని తీసుకొస్తాయి. ఆ రెండు పాటల చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. విరామ సన్నివేశాలకు ముందు కథలో మలుపు ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో కథ పూర్తిగా ఓ కొత్త మలుపుని తీసుకుంటూ, గ్రామ రాజకీయాల నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. అక్కడి నుంచి సినిమా దసవత్తరంగా సాగుతుంది. మొత్తంగా నవీన్ తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.
Read also-Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?
ఎవరెలా చేశారంటే..
హీరో పాత్రలో కనిపించిన నవీన్ పొలిశెట్టి వన్ మేన్ షోలా ఉంటుంది ఈ సినిమా. ప్రతీ సన్నివేశంలోనూ తెరపై కనిపిస్తూ, అల్లరి చేస్తుంటాడు. హీరోయిన్ అయిన చారులత పాత్రలో మీనాక్షి చౌదరి ఆకట్టుకుంటుంది. ఆమెకి ఇందులో ప్రాధాన్యమున్న పాత్రే దక్కింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించింది. హీరోతో కనిపించే చమ్మక్ చంద్ర, మహేశ్, బుల్లిరాజుగా సుపరిచితమైన మాస్టర్ రేవంత్ అక్కడక్కడా నవ్వించారు. రావు రమేశ్ తన దైన శైలిలో మరోసారి పాత్రలో ఇమిడిపోయారు. మిక్కీ జె.మేయర్ అందించిన పాటలు, బీజీఎమ్ సంగీతంతో సినిమాపై గట్టి ప్రభావమే చూపించారు. ఈ సినిమాలో కథ లేదనే విషయం బయట పడకుండా, హాస్యం పండించేందుకు రచయితలు చేసిన కృషి ఫలించిందనే చెప్పుకోవాలి.
బలాలు
- నవీన్ పొలిశెట్టి కామెడీ
- మాటలు
- ఫస్ట్ హాఫ్
బలహీనతలు
- కథలో కొత్తదనం లేకపోవడం
- కథనం
రేటింగ్ – 3 /5

