Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా నుంచి నటి అవుట్.
toxic-actor
ఎంటర్‌టైన్‌మెంట్

Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?

Yash Toxic: కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా కు పాత్రలను పరిచయం చేసే క్రమంలో హీరో ఇంట్రో ఇండియాలో పెను సంచలనమూ రేపింది. (Toxic) టీజర్‌లో వివాదాస్పదమైన ‘సెమెట్రీ సీన్’ పెద్ద చర్చకు దారితీసింది. ఆ సన్నివేశంలో యష్‌తో కలిసి కనిపించిన బ్రెజిలియన్ మోడల్ బియాట్రిజ్ టౌఫెన్‌బాచ్ (Beatriz Taufenbach) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క రోజులోనే ఆ టీజర్ ను ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ల మంది చూశారు. ఈ టీజర్ అప్పడు అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోగా రికార్డులు కూడా బద్దలు గొట్టింది. అయితే ఈ వివాదం ఎక్కడివరకూ వెళుతుంతో చూడాలి మరి.

Read also-Megastar Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?.. బాస్ కొల్లగొట్టాడుగా..

వివాదం ఏమిటి?

జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘టాక్సిక్’ టీజర్‌లో ఒక సన్నివేశంలో యష్, బియాట్రిజ్‌లు శ్మశాన వాటికలో ఉన్న కారులో చాలా సన్నిహితంగా కనిపిస్తారు. ఈ సీన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పవిత్రమైన శ్మశాన వాటికలో ఇలాంటి ‘అశ్లీల’ సన్నివేశాలు చిత్రీకరించడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని పలువురు సామాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీలు ఆరోపించాయి. ఈ టీజర్ మహిళల గౌరవానికి భంగం కలిగిస్తోందని, పిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని కర్ణాటక మహిళా కమిషన్ మరియు సెన్సార్ బోర్డు (CBFC)కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ వివాదం జతీయ స్థాయిలో పెద్ద చర్చగా మారింది.

Read also-Director Maruthi: మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే.. నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లే!

ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు తొలగించారు?

టీజర్ విడుదలైన తర్వాత ఆ సన్నివేశంలో ఉన్నది ఎవరనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. మొదట ఆమె హాలీవుడ్ నటి నటాలీ బర్న్ అని ప్రచారం జరిగింది, కానీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఆమె పేరు బియాట్రిజ్ టౌఫెన్‌బాచ్ అని స్పష్టం చేశారు. దీనితో నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వెతకడం ప్రారంభించారు. ఒకవైపు నెటిజన్ల ట్రోలింగ్, మరోవైపు పెరుగుతున్న వివాదం, వ్యక్తిగత విమర్శల కారణంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాను డియాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రొఫైల్ సెర్చ్ చేస్తే ‘లింక్ అందుబాటులో లేదు’ అని చూపిస్తోంది. ఈ వివాదంపై దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ.. ఇది మహిళా సాధికారత, వారి ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశమని పరోక్షంగా పేర్కొన్నారు. “మహిళల ఆనందం, సమ్మతి (consent) గురించి జనం అర్థం చేసుకునే వరకు నేను వేచి చూస్తాను” అన్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

Just In

01

Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..

GHMC: సరి కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్న జీహెచ్ఎంసీ.. రిజల్ట్ అదరహో…!

Bandi Sanjay: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పథకం ఎందుకు వద్దు..?

Illegal Soil Mining: అనుమతులు లేకుండా అదును చూసి.. దర్జాగా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు

Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?