Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సార్లు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చూపించారు. సంక్రాంతికి ముందు తమ కుటుంబ సభ్యులందరితో బెంగళూర్ ఫామ్ హౌస్‌కి వెళ్లడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. అక్కడే ఈ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీలోని బంధువులందరినీ ఆహ్వానించి, అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఈ సంవత్సరం కూడా మెగా ఇంట సంక్రాంతి సందడి అట్టహాసంగా మొదలైంది. ‘భోగి’ (Bhogi) స్పెషల్‌గా మెగా ఫ్యామిలీ (Mega Family) అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోని మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోను షేర్ చేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read- Nidhhi Agerwal: మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది.. ‘రాజా సాబ్’పై నిధి!
మెగా ఇంట సంక్రాంతి సందడి
ఇక ఈ వీడియోలో పంజా వైష్ణవ్ తేజ్ మొదలుకుని రామ్ చరణ్ వరకు అంతా దోశెలు వేస్తున్నారు. కుర్రాళ్లంతా దోసెలు వేస్తుంటే.. పెద్దవాళ్లు భోగి మంట వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. ఈసారి ఈ పండగ నిమిత్తం వారు బెంగళూరు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఈ వీడియో తెలియజేస్తుంది. వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దోశెలు వేస్తుంటే నిహారిక అండ్ టీమ్ సర్వ్ చేస్తోంది. ఆ టీమ్ తర్వాత రామ్ చరణ్ (Ram Charan), సుస్మిత దోశెలు వేసే ప్రోగ్రామ్ తీసుకున్నారు. మెగా కోడలు ఉపాసన హాయిగా నవ్వుతూ కనిపించారు. పిల్లలందరూ దోశెలను ఆరగిస్తున్నారు. నాగబాబు ఫోన్ చూస్తూ ఉంటే, మెగాస్టార్ చిరంజీవి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అల్లు అరవింద్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఇక ఈ వీడియో చూసిన వారంతా మెగా ఇంట సంక్రాంతి సందడి మొదలైందిరో అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Anasuya: నేనూ మనిషినే, ఆ బలహీనత నా తప్పు కాదు.. అనసూయ షాకింగ్ పోస్ట్
అందుకే భోగి రోజు దోశెలు..
ఇది ఇలా ఉంటే, ప్రతి సంక్రాంతికి భోగి రోజు ఇలా దోశెలు ఎందుకు వేసుకుంటారు? అంటూ ఈ వీడియోకు ఎక్కువగా కామెంట్స్ పడుతున్నాయి. సంక్రాంతి పండుగలో ఈ దోశెలు ఎందుకు భాగమయ్యాయి? అంటే, సంక్రాంతి పండుగలో మొదటి రోజైన భోగి రోజు.. చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రపదేశ్‌లోని కొన్ని ఏరియాట్లో దోశెలు వేసుకోవడం ఒక ఆచారంగా. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. సంక్రాంతి అంటేనే పంటల పండుగ. ఆ సమయంలో కొత్త బియ్యం చేతికి వస్తాయి. కొత్త బియ్యంతో చేసిన పిండితో దోశెలు వేసి, వాటిని ఇష్టదైవానికి లేదా భోగి మంటలకు నైవేద్యంగా సమర్పించడం ఒక సంప్రదాయం. అలాగే భోగి పండుగ విపరీతమైన చలి కాలంలో వస్తుంది. దోశెలు వేడివేడిగా తింటే శరీరానికి శక్తిని, వెచ్చదనాన్ని ఇస్తాయి. అందుకే ఆ రోజు ఉదయాన్నే భోగి మంటల వద్ద చలి కాచుకుంటూ వేడి దోశెలు తినడం ఒక అలవాటుగా మారింది. ఇంకా సంక్రాంతి పండగ అనగానే రకరకాల పిండివంటలు వండడంలో మహిళలు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి, భోగి రోజు ఉదయం త్వరగా అయిపోయే, అందరికీ నచ్చే అల్పాహారంగా దోశెలను ఎంచుకుంటారు. ఇదన్నమాట దోశెల వెనుక ఉన్న కహానీ.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

