The Raja Saab: ‘ది రాజాసాబ్’కు ఎందుకు మిక్సుడ్ టాక్ వచ్చింది..
the-rajasab-talk
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’కు ఎందుకు మిక్సుడ్ టాక్ వచ్చింది.. మారుతి చేసిన తప్పు ఇదేనా?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే తెలియనివారుండరు. బాహుబలి, సలార్, కల్కీ సినిమాలు ప్రభాస్ స్టార్ డమ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేశాయి. దాదాపు ఈ సినిమాలు అన్నీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లుకు పైగానే వసూలు చేశాయి. దీంతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిపోయారు. తాజాగా మారుతి దర్శకత్వంలో విడుదలైన ‘ది రాజాసాబ్’ ఈ సంక్రాంతికి విడుదలై మిక్సుడ్ టాక్ తెచ్చుకుంది. అయితే నిజంగా సినిమా అందరికీ నచ్చలేదా అంటే కాదు అనే చెప్పాలి ఎందుకంటే.. ఇప్పటి వరకూ యాక్షన్ మూడ్ లో ప్రభాస్ ను చూసిన అభిమానులు ఒక్క సారిగా కామెడీ చేస్తుంటే, దానికి స్విచ్ అవ్వలేక పోయారు. దీనికి తోడు సినిమా కూడా ఎవరికీ తెలియని జానర్ లో వెళుతుంది. పాయింట్ కొత్తదే అయినా మంచి స్టోరీ ఉన్నా మరి ఎక్కడ పొరపాటు జరిగింది? అసలు నిజంగా అది దర్శకుడి పొరపాటేనా? లేదా అర్థం చేసుకోకపోవడం ప్రేక్షకుల పొరపాటా? దీని గురించి ఇక్కడ చూద్దాం.

Read also-Nidhhi Agerwal: మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది.. ‘రాజా సాబ్’పై నిధి!

భారంగా మొదటి భాగం!

సినిమాను రెండు భాగాలుగా మాట్లాడుకుంటే.. మొదటి అర్ధంలో ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏం కావాలనుకుంటున్నారో అది అసలు కనబడలేదు. ప్రారంభమే పాత ఫార్మెట్లో మొదలై ప్రేక్షకులను కొంచెం నిరాశపరుస్తుంది. అనవసరమైన కామెడీ, అర్థం పర్ధం లేని లాజిక్స్ ప్రేక్షకుడి కోపానికి పరీక్ష పెడతాయి. ఉదాహరణగా చెప్పుకుంటే.. ప్రభాస్ నాయినమ్మ సొమ్మసిల్లిపోతే.. మహేష్ తో ప్రభాస్ చేసే కామెడీ రాజ పాత్రకు కొంచెం నెగిటివిటీని తెచ్చిపెడుతోంది. తర్వాత కొన్ని యాక్షన్ సీన్స్ ఇక్కడ లాజిక్ లేకుంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆ సీన్లు తీసినట్లు ఉంటుంది. కథ, కథనం మీద ఉండాల్సిన ప్రేక్షకుడి మైండ్ లాజిక్స్ వైపుకు మళ్లుతోంది. దీంతో కథ ఎంగేజింగ్ గా అనిపించదు. ఇదే తరహా యాక్షన్ కామెడీతో దాదాపు రెండు గంటలు సినిమాని లాక్కొస్తారు. అప్పటికే నిరాశతో ఉన్న ప్రేక్షకుడు ఎప్పుడు సినిమా అయిపోతుందా అన్న ఉద్దేశంతో ఉంటాడు. కానీ ప్రభాస్ మాత్రం సినిమా కోసం ప్రాణం పెట్టాడనే చెప్పాలి. దర్శకుడు కూడా సినిమా కోసం మూడేళ్లు పనిచేశారని చెప్పారు. అది మొత్తం చివరి నలభై నిమిషాల కోసమే అయి ఉండవచ్చు.

Read also-Miracle Movie: సంక్రాంతి కానుకగా ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్ మోడ్‌లో ప్రభాస్ నిమ్మల

చివరి నలభై నిమిషాలు బాగా తీయడం కోసం మొదటి రెండు గంటలు వదిలేశారు. కథ పరంగా మాత్రం సినిమా చాలా బలంగా ఉంటుంది. అసలు చివరి నలభై నిమిషాలు అయితే కథ మన ఆలోచనలకు అందదు. హీరోయిన్లతో ప్రభాస్ కెమిస్ట్రీ కొన్ని సందర్భాల్లో కుదిరినా కొన్ని సార్లు అసలు వీళ్లు ఎందుకు వస్తున్నారు అనిపిస్తుంది. అసలు ఈ సినిమాకు ఎందుకు ఇలా రివ్యూలు వస్తున్నాయంటే? కథ మారుతీ రాసినా.. దర్శకత్వం మాత్రం వేరేవారు చేసి ఉండాల్సింది. ప్రభాస్ యాక్షన్ సినిమాల ప్రభావం ఆ టెంపోలో లేకపోయినా అదే విధంగా చూపించడానికి దర్శకుడు ప్రయత్నిస్తాడు. బోమిన్ ఇరానీ పాత్ర ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుడేది. ఎందుకంటే హీరోకు ఎలివేషన్ ఇవ్వాలి కాబట్టి. అసలు ఈ సినిమా మొదటి భాగం దాదాపు అరగంటకు పైగా ట్రిమ్ చేయవచ్చు. దీనికి తోడు ప్రభాస్ రివర్స్ ఫైట్ తీసేయడం. అసలు ఆ ఫైటర్ ఎక్కడ వస్తుందా అని వెయిట్ చేసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. మొదటి బాగం కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకొంచెం మంచి టాక్ వచ్చి ఉండేదని అభిమానులు ఆశపడుతున్నారు.

Just In

01

Harish Rao: రాజకీయ వికృత క్రీడల్లో ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

Jogipet Municipality: జోగిపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రాలు.. ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు!

Seethakka: మేడారం జాతరకు తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు.. పనితీరును సమీక్షిస్తూ మంత్రి సీతక్క దిశానిర్దేశం!

Mega Family: మెగా ఇంట మొదలైన సంక్రాంతి సందడి.. ‘భోగి’ స్పెషల్ వీడియో వచ్చేసింది

The Raja Saab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’కు ఎందుకు మిక్సుడ్ టాక్ వచ్చింది.. మారుతి చేసిన తప్పు ఇదేనా?