Celebrity Breakup: సినీ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ వారి ప్రేమ బంధానికి ముగింపు పలికారు. ప్రేమకు అర్ధం చెప్పిన ఈ లవ్ బర్డ్స్ ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే, కొంత మంది దీన్ని నమ్మలేకపోతున్నారు. వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా సరైన కారణం బయటకు రాలేదు. వీళ్ళు ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ లవ్ లీ కపుల్ అందరికీ విడిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు. అసలేం జరిగిందో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం ..
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై జ్యోతిష్యుడు అంత మాట అనేశాడేంటి? ఆమెకు వివాహం జరగదా..?
విడిపోయిన బాలీవుడ్ జంట
బాలీవుడ్ టెలివిజన్ నటి నటులు ఖుషాల్ టండన్, శివాంగి జోషి ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా.. ఇదే నిజం. ఈ విషయాన్ని ఖుషాల్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఈ స్టోరీని చూసిన వారి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వాళ్ళు విడిపోయి కూడా ఐదు నెలలు అవుతుందని ఇంకో బిగ్ షాక్ ఇచ్చారు. శివాంగి జోషి కొత్త సీరియల్ షో ‘బడే అచ్చే లగ్తే హై 4’ ప్రసారానికి ముందే ఖుషాల్ ఈ వార్తను ఇలా పోస్ట్ రూపంలో తెలపడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!


ఖుషాల్ తన ఇన్ స్టా ఈ విధంగా రాసుకొచ్చాడు.. నా ప్రియమైన వారందరికీ.. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇకపై నేను, శివాంగి కలిసి ఉండలేమని చెప్పాలనుకుంటున్నాను. మేము బ్రేకప్ చెప్పుకుని కూడా ఐదు నెలలైందని పోస్ట్ పెట్టారు. అయితే, ఈ పోస్ట్ ఖుషాల్ వెంటనే తీసేనప్పటికీ కూడా.. వారు కలిసిలేరనే వార్తను చూసిన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అంతే కాదు, వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు.