Vasudheva Sutham Song Launch (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Vasudheva Sutham: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’కు ఆకాష్ జగన్నాథ్ సపోర్ట్!

Vasudheva Sutham: మాస్టర్ మహేంద్రన్ (Master Mahendran) హీరోగా.. బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వసుదేవసుతం’ (Vasudheva Sutham). రెయిన్‌బో సినిమాస్ (Rainbow Cinemas) బ్యానర్‌పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్‌ వంటివి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాష్ జగన్నాథ్ (Hero Akash Jagannadh) సపోర్ట్ అందించారు. ఆయన ఏం చేశారంటే..

Also Read- Bigg Boss Telugu 9: మాధురి అలక.. ప్యాక్ యువర్ బ్యాగ్ పవన్.. రామూ రాథోడ్ నవ్వుల నజరానా

మణిశర్మ సంగీతంలో..

తాజాగా చిత్ర టీమ్ ‘వసుదేవసుతం దేవం’ అంటూ సాగే పాటను (Vasudheva Sutham Dhevam Lyrical Song) ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ (Manisharma) అద్భుతమైన బాణీలతో డివోషనల్ టచ్ ఇచ్చి, కొన్నాళ్ల పాటు నిలిచిపోయే సాంగ్‌ని, ఆయన ఖాతాలో మరో చార్ట్ ‌బస్టర్ సాంగ్‌ని యాడ్ చేసుకున్నారు. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ జంట కూడా చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట చాలా న్యాచురల్‌గా ఉండటమే కాకుండా.. చాలా వినసొంపుగా ఉంది ఒక్కసారిగే ఎక్కేస్తుంది. ఇక తెర అంతా కూడా కలర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పాటకు కొరియోగ్రఫీ కూడా చక్కగా కుదిరినట్టుగా ఈ లిరికల్ వీడియో తెలియజేస్తుంది.

Also Read- Biker First Lap: ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’.. ‘బైకర్’ గ్లింప్స్ ఎలా ఉందంటే?

పాట రిలీజ్ చేసినందుకు హ్యాపీ

ఈ పాట విడుదల చేసిన అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘వసుదేవసుతం’ చిత్రంలోని టైటిల్ సాంగ్ ‘వసుదేవసుతం దేవం’ అనే పాటను విడుదల చేసినందుక చాలా హ్యాపీగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. టీమ్ అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం నిజంగా ఆనందాన్నిచ్చింది. చైతన్య ప్రసాద్ సాహిత్యం, మణిశర్మ సార్ సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. పాటను విడుదల చేసి, యూనిట్‌కు సపోర్ట్ చేసినందుకు టీమ్ అంతా ఆకాష్ జగన్నాథ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమా బంపర్ హిట్ కావాలని కోరారు. ‘వసుదేవసుతం’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని తెలియజేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌ చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బద్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్ వంటి వారంతా ఈ చిత్రంలో నటిస్తున్న తారాగణం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Duddilla Sridhar Babu: వీఎఫ్‌ఎక్స్ గేమింగ్‌కు ప్రభుత్వం కో క్రియేటర్.. ఫ్యూచర్స్ ఫండ్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్ పిలుపు

Hyderabad Police: నార్త్‌జోన్‌లో నేరగాళ్లకు చెక్.. వేర్వేరు కేసులకు సంబంధించిన నిందితులను అరెస్ట్.. బంగారు నగలు, ఫోన్లు స్వాధీనం!

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకే.. ముస్లీం మైనార్టీ ఓటర్లు ఆలోచించాలి.. టీపీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

Telangana Land Scam: గత ప్రభుత్వంలో పట్టా భూమిగా మారిన సీలింగ్​.. ప్రభుత్వ అధీనంలోని భూములు అన్యాక్రంతం!