Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) మరో వీకెండ్‌కు వచ్చేసింది. హౌస్‌లో 55వ రోజు శనివారం కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎంట్రీ ఉంటుందనే విషయం తెలియంది కాదు. వారం రోజులుగా జరిగిన ఇంట్లోని విషయాలపై హోస్ట్ నాగార్జున రివ్యూ ఇస్తూ.. ఎవరెవరు తప్పులు చేశారో వారికి ఇచ్చి పడేస్తుంటారు. ఆడియెన్స్‌ను ఇన్వాల్వ్ చేస్తూ.. వారితో ఓటింగ్ కూడా వేయిస్తుంటారు. అలా ఈ వారం ఎవరెవరికి క్లాస్‌లు పడబోతున్నాయో తెలిపేందుకు, శనివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు. ఈ ప్రోమోలను చూస్తుంటే ఇంటి సభ్యులకు గట్టిగానే క్లాసులు పడినట్లుగా అర్థమవుతోంది. ఈ వారం హౌస్‌లో రీ ఎంట్రీ పేరుతో జరిగిన టాస్క్‌లలో కావాల్సినంత వినోదాన్ని పంచిన బిగ్ బాస్.. అందులో అతి చేసిన కంటెస్టెంట్స్ తోక కత్తిరించేందుకు కింగ్ నాగార్జునను లైన్‌లోకి తెచ్చేశారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలను గమనిస్తే..
Also Read- Biker First Lap: ‘గెలవడం గొప్ప కాదు.. చివరిదాకా పోరాడటం గొప్ప’.. ‘బైకర్’ గ్లింప్స్ ఎలా ఉందంటే?
బిర్యానీ రచ్చ
టాస్క్ ఫైర్ అంటూ వచ్చిన మొదటి ప్రోమోలో కింగ్ నాగార్జున నార్మల్‌గానే ఎంట్రీ ఇచ్చారు. ‘ప్లేట్లు దగ్గర, బిర్యానీ దగ్గర.. అక్కడే మొదలవుతున్నాయి గొడవలన్నీ. నథింగ్ టు వర్రీ.. లోపలికి వెళ్లిన తర్వాత సెట్ చేద్దాం.. ఆలస్యం లేకుండా మన టీవీ’ అంటూ వెంటనే హౌస్‌లోకి వెళ్లిపోయారు. ‘బిగ్ బాస్ మీకీరోజు ఇస్తున్న టాస్క్. థమ్సప్ బిర్యానీ టాస్క్. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులు రెండు టీమ్స్‌గా ఆడాల్సి ఉంటుంది. ట్రెలో ఉన్న బిర్యానీ చేయడానికి కావాల్సిన వస్తువులను సూచించే ట్యాగ్స్‌ను, ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్లి తమ పోడియం మీద ఉన్న బాక్స్‌లో వేయాలి. ఏ టీమ్ అయితే ఎక్కువ ట్యాగ్స్‌ని సేకరించి తమ బాక్సులో పెడతారో వారు ఈ టాస్క్ విజేతలు అవుతారు’ అని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను భరణి చదివి వినిపిస్తున్నారు. పవన్, మాధురి ఈ టాస్క్‌లో ఆడుతున్నారు. ఇక బిర్యానీ వడ్డించే క్రమంలో భరణి, మాధురికి చెప్పిన ఒక్కమాటతో ఆమె అలిగారు. బిర్యానీ పీస్‌ల విషయంలో ఆమె అలగడంతో.. కావాల్సినంత డ్రామా నడుస్తుంది. దివ్య మధ్యలో కలగజేసుకోవడంతో.. ఆమెను మాధురి దులిపేసింది. ఈ గ్యాప్‌లో భరణికి తనూజ ఏమేం నూరి పోయాలో అవి నూరిపోస్తుంది. అంతటితో ప్రోమో 1 ముగిసింది.
ప్యాక్ యువర్ బ్యాగ్ పవన్
డిమోన్ ఇన్ డేంజర్ అని వచ్చిన రెండో ప్రోమోలో.. భరణి, కళ్యాణ్, సంజన, ఇమ్మానుయేల్ ఫేస్‌లకు కత్తిని గుచ్చిన కింగ్ నాగార్జున.. సంజనకు క్లాస్ ఇస్తున్నారు. ‘నామినేషన్స్‌లోకి రాగానే నీ మూడ్ మొత్తం ఎందుకు మారిపోతుంది? తొక్కలో కెప్టెన్ అనడానికి కారణం నాకు తెలుగు రాదు అన్నారు. నామినేషన్స్ అయిన తర్వాత నువ్వు లోపలికి వచ్చి.. సుమన్‌ని గిల్లావు. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి కానీ, బ్రెయిన్ లెస్, సెన్స్ లెస్, షటప్, హు ఆర్ యు.. ఇవన్నీ ఎందుకు? నువ్వు గురివింద గింజలాగా బిహేవ్ చేయకు’ అని నాగార్జున క్లాస్ ఇస్తున్నారు. సంజన పక్కన దివ్య కూడా నిలబడి ఉంది. తర్వాత కళ్యాణ్‌ని ఉద్దేశించి ‘రేషన్ మేనేజర్ పైన నీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించారు. టైమింగ్, అబ్జర్వింగ్‌లో వీక్ అని కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు. ఈ విషయంలో కెప్టెన్ దివ్యని అడిగి తెలుసుకున్న బిగ్ బాస్.. ఓ వీడియోను చూపించి.. వారికి క్లాస్ ఇస్తున్నారు. తర్వాత పవన్‌ని ఉద్దేశించి ఓ వీడియోను చూపించారు. అందులో రీతూని పవన్ నెడుతున్నారు. ‘పవన్ బిహేవియర్‌కి మీ ఇంట్లో ఉంటే.. మీ బెల్ట్ పెట్టి కొట్టేవాళ్లా? కదా?’ అని ఆడియెన్స్‌ని నాగ్ ప్రశ్నించారు. ఆడియెన్స్ వివరణ ఇస్తున్నారు. వెంటనే పవన్ సారీ చెప్పాడు. నీ సారీని బిగ్ బాస్ కేర్ చేయడని నాగ్ చెప్పారు. బిగ్ రెడ్ ఫ్లాగ్ అంటూ.. ప్యాక్ యువర్ బ్యాగ్ అని నాగ్ ఆర్డర్ వేశారు. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్ అని నాగ్ అనగానే డోర్ తెరుచుకుంది. రీతూ.. సార్ సార్ అని అంటున్నా.. వెంటనే బ్యాగ్ సర్దుకుని వచ్చెయ్ అంటూ నాగార్జున సీరియస్‌గా ఆర్డర్ వేస్తున్నారు. ఈ ప్రోమోతో అసలు సిసలైన ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్ అనే సంకేతాన్ని నాగ్ పంపించారు.
Also Read- Peddi: అచ్చియమ్మగా జాన్వీ కపూర్.. డబుల్ ట్రీట్ ఇచ్చిన మేకర్స్!
ఎటువంటి సంబంధం లేదు
రాము రాథోడ్ ఫన్ అంటూ వచ్చిన మూడో ప్రోమోలో.. అందరినీ నవ్విస్తున్నారు నాగ్. ఈ వారంలో రాము చేసిన చేష్టలన్నీ కలిపి ఓ వీడియోను ప్లే చేశారు. హౌస్‌లో గొడవలు పడుతున్నా, సీరియస్‌గా డిస్కషన్స్ నడుస్తున్నా, అసలు ఏం జరుగుతున్నా నాకేం సంబంధం లేదనేలా రాము రాథోడ్ ప్రవర్తించిన తీరుని వీడియోగా చేసి చూపించడంతో.. అంతా హాయిగా నవ్వుకుంటున్నారు. కింగ్ నాగార్జున కూడా ఈ వీడియో చూసి నవ్వుకున్నారు. ‘లాస్ట్ వీక్ నాకు తనూజ చెప్పినప్పుడు ఏం అర్థం కాలేదు కానీ, ఈ వీడియో చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. అక్కడున్న వాళ్ల ఎమోషన్స్‌తో కానీ, సిచ్యుయేషన్స్‌తో కానీ.. రామూకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్లందరూ కేవలం ఒక సెట్ ప్రొపర్టీస్ అంతే’ అని కింగ్ చెబుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
