Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటి వరకు రామ్ చరణ్ పైనే ఫోకస్ పెట్టిన మేకర్స్.. తాజాగా, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న జాన్వీ కపూర్ లుక్‌ని (Janhvi Kapoor in Peddi Movie) రివీల్ చేశారు. ఆమె లుక్‌ని రివీల్ చేస్తూ.. ఒక్కటి కాదు.. రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చేశారు.
Also Read- OG Let’s Go Johnny song: ‘ఓజీ’ సినిమా నుంచి ‘లెట్స్ గో జానీ’ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూసేయండి మరి
ఈసారి బ్లాక్ బస్టరే..
జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె సినిమాలైతే చేస్తుంది కానీ, సరైన హిట్ మాత్రం ఆమెకు ఇంత వరకు పడలేదు. ఆమె వైపు నుంచి ఎటువంటి ప్రయత్న లోపం లేకపోయినా, హిట్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షగానే మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆమె ఇతర సినిమా ఇండస్ట్రీలపై దృష్టి పెట్టి మంచి మంచి అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్న జాన్వీ కపూర్.. ఇప్పుడు మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకునేందుకు ‘పెద్ది’తో సిద్ధమవుతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన నటించిన ‘దేవర’తో సక్సెస్ అందుకున్న జాన్వీకపూర్.. ఇప్పుడు రామ్ చరణ్ సరసన నటిస్తూ.. ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాననే ధీమాలో ఉంది. ఇక మేకర్స్ ఇప్పటి వరకు ఆమె లుక్‌ని రివీల్ చేయలేదు. చిత్ర ప్రారంభోత్సవం రోజు కనిపించడం తప్పితే.. మళ్లీ ‘పెద్ది’కి సంబంధించి జాన్వీ ఎక్కడా కనిపించలేదు.
ఫియర్ లెస్ లేడీగా..
ఆమె బర్త్‌డే కూడా కాదు కానీ, తాజాగా ఆమె లుక్‌కి సంబంధించి మేకర్స్ రెండు పోస్టర్స్ విడుదల చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇటీవల శ్రీలంకలో ఓ పాటను చిత్రీకరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పాటకు సంబంధించిన స్టిల్స్ ఇవనేది అర్థమవుతోంది. ఇందులో అచ్చియమ్మగా జాన్వీ కపూర్ కనిపించనుందని తెలుపుతూ.. ఫియర్ లెస్ లేడీగా ఇందులో ఆమె పాత్ర ఉంటుందని మేకర్స్ తెలియజేశారు. ఇక విడుదల చేసిన రెండు పోస్టర్స్‌లో తన గ్లామర్‌తో జాన్వీ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. జాన్వీ కపూర్ పేరును, పెద్ది టైటిల్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చేశాయి. ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్. రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జగపతి బాబు, దివ్యేందు శర్మా ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా 27 మార్చి 2026న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురానున్నారు.
Our #Peddi‘s love with a firebrand attitude 😎🔥
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/LFsESjTmYK
— PEDDI (@PeddiMovieOffl) November 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
