OG Let’s Go Johnny song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఓజీ’ చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘లెట్స్ గో జానీ’ వీడియో సాంగ్ విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చి రికార్డులు క్రియోట్ చేస్తుంది. లెట్స్ గో జానీ అంటూ సాగే ఈ పాటలో పవన్ కళ్యాణ్ జానీ సినిమాను గుర్తు చేస్తుంది. ఆ సినిమా పై ఉన్న మక్కువతో దర్శకుడు ఈ సినిమాలో ఈ పాట ను పెట్టారు. అయితే ఇప్పుడు విడుదలైన ఈ పాట డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
Read also-Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చేసింది.. ఇక్కడ చూసేయండి..
సుజీత్ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కేవలం 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి, 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. భారతదేశంలోనే దాదాపు రూ. 192.84 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను దాటేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది.
Read also-Prasanth Varma: ప్రశాంత్ వర్మకు అడ్వాన్స్ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్..

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				