Rajashekar: యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ సినిమాలలో కనిపించి చాలా కాలం అవుతుంది. ఆయన హీరోగా ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య నితిన్ సినిమాలో మాత్రం కనిపించారు. ఆ తర్వాత ఆయన ఏ సినిమాకు సైన్ చేసినట్లుగా వార్తలు కూడా రాలేదు. కానీ సడెన్‌గా ఆయన శర్వానంద్ ‘బైకర్’ గ్లింప్స్‌లో దర్శనమిచ్చి, అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు, ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు హాజరై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవలే శర్వా స్పోర్ట్స్ గేర్‌తో ‘బైకర్’ అవతార్‌లో ఉన్నట్లు చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. శర్వా జిమ్ స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. శనివారం, మేకర్స్ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వేడుకకు రాజశేఖర్ కూడా హాజరయ్యారు.
‘కె ర్యాంప్’కు కౌంటర్
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన ‘కె ర్యాంప్’ సినిమాలో తన పాటను అనుకరించిన విధానంపై చిన్న ఝలక్ ఇచ్చారు. ఆయన స్వయంగా ఆ పాటను స్టేజ్‌పై పాడటంతో అందరూ ఈలలు వేసి క్లాప్స్ కొట్టారు. అంటే డైరెక్ట్‌గా ‘కె ర్యాంప్’ టీమ్‌ని ఉద్దేశించే ఆయన ఈ విధంగా చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనంతరం ‘బైకర్’ గురించి మాట్లాడుతూ.. ‘‘కరోనా రావడంతో చాలా ఇబ్బంది పడ్డాను. కోలుకోవడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఆ మధ్య ఓ సినిమా షూటింగ్‌కు విదేశాలకు వెళ్లినప్పుడు.. మా ఫొటోగ్రాఫర్ రాకపోవడంతో.. అక్కడి ఫొటోగ్రాఫర్‌ను తీసుకున్నాం. ఆయన నా గురించి అడిగితే.. చెప్పాను. వందకు పైగా సినిమాలు చేశానని, నా గురించి ఇంకా చెప్పాను. వెంటనే ఆయన ‘మీరు చాలా లక్కీ’ అని అన్నారు. కానీ కరోనా తర్వాత సినిమాలు లేక ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. నిజంగా వర్క్ లేకపోతే.. జైల్లో ఉన్నట్లే అనిపించేది. కరోనా నుంచి కోలుకుని అంతా ఫిట్ అయిన తర్వాత ఎలాంటి పాత్రలు చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఏవి నాకు అంతగా నచ్చలేదు.
Also Read- Bigg Boss Telugu 9: మాధురి అలక.. ప్యాక్ యువర్ బ్యాగ్ పవన్.. రామూ రాథోడ్ నవ్వుల నజరానా
శాటిస్‌ఫ్యాక్షన్ ఉండేది
హీరోగానే కాకుండా మంచి పాత్రలు కూడా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నాను. ఏవీ నాకు సంతృప్తిని ఇచ్చేవి కావు. మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది. అలాంటి సమయంలో డైరెక్టర్ అభి ఈ ‘బైకర్’ స్టోరీ చెప్పారు. అద్భుతమైన సబ్జెక్టు. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని నాకు అనిపించి ఓకే చెప్పాను. సినిమా అద్భుతంగా వచ్చింది. అభి ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా డిజైన్ చేశారు. సెట్‌లో ప్రతిరోజు చాలా ఎంజాయ్ చేశాను. షూటింగ్ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు చాలా శాటిస్‌ఫ్యాక్షన్ ఉండేది. వంశీ సూపర్ ప్రొడ్యూసర్. చాలా కూల్‌గా ఉంటాడు. ఈ సినిమాకి అయిన ఖర్చు చూస్తే నాకు భయమేసేది. కానీ వంశీ ఎప్పుడు చాలా కూల్‌గా ఉండేవారు. శర్వా చాలా కోపరేటివ్. చాలా రెస్పెక్ట్‌బుల్. ఈ సినిమా డబ్బింగ్ చూసి శర్వా నా దగ్గరకు వచ్చి ‘సార్ మీరు చాలా అద్భుతంగా చేశారు. మీరు ఈ క్యారెక్టర్ చేసినందుకు థాంక్స్’ అని చెప్పారు. నిజంగా అది నాకు పెద్ద అవార్డుతో సమానం. బైకర్ సినిమాను అందరూ చూడండి. అందరికీ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
