Salman Khan Marriage : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మెగాస్టార్ మనకి ఎలాగో హిందీలో సల్మాన్ ఖాన్ కూడా అంతే. ఎన్నో హిట్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబందం లేకుండా తన ఫ్యాన్స్ కోసం మూవీస్ చేస్తుంటాడు. ఇటీవలే సికిందర్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితం అయితే అందుకోలేక పోయింది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కు జోడీగా హీరోయిన్ పూజ హెగ్డే నటించింది.
Also Read: AICC Meenakshi Natarajan: నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య.. మీనాక్షి నటరాజన్ సీరియస్
ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరో సినిమా చేయడానికి కాస్త సమయం తీసుకుని మంచి కథతో మన ముందుకు వస్తారని సినీ వర్గాల వారు చెబుతున్నారు. అయితే, ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు, ఆయన ఏం మాట్లాడాడో ఇక్కడ తెలుసుకుందాం..
నా లైఫ్ లో నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అందరికీ ఉన్నట్లే నాకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయి. కాకపోతే అవి బ్రేకప్ అయ్యాయి. నిజం చెప్పాలంటే నేను ప్రేమించిన అమ్మాయిలలో ఎలాంటి తప్పు లేదు. నేనే నాకు నచ్చినట్లు బిహేవ్ చేస్తాను. దాని వలన వాళ్ళు నాకు దూరమయ్యారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా చూసుకోలేక పోతే ఆమె నేను బాధ పెట్టినట్టే కదా.. అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా ప్రేమ కథలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కానీ, ఒక అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసినప్పుడు చాలా బాధ పడ్డాను అంటూ సల్మాన్ తన మాటల్లో చెప్పుకొచ్చాడు.
నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న అంచనాలకు తగ్గట్టు నేను లేనేమో అనుకున్నా.. అందుకే ఆమె కూడా ఏం ఆలోచించకుండా నన్ను రిజెక్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని చాలా కలలు కన్నాను. కానీ, అవన్ని మధ్యలోనే ఆగిపోయాయి. జుహీ చావ్లా నాతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సింగిల్ గా ఉంటున్నానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.. ఆమె మాత్రం జై మెహతా ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందంటూ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Also Read: Plane Crashes In India: దేశాన్ని కుదిపేసిన ఘోర విమాన ప్రమాదాలు.. ప్రతీ ఘటన తీవ్ర విషాదమే!
సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఈ మాటల పై రియాక్ట్ అవుతూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది పెళ్లి గురించి ఇలా మాట్లాడారంటే చాలా బాధలో ఉన్నారేమో? అలాగే తాను ప్రేమించిన జుహీ చావ్లా కూడా బాగా గుర్తు వచ్చి ఉంటుంది అంటూ దాదాపు సల్మాన్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.