AICC Meenakshi Natarajan (imagcredit:twitter)
తెలంగాణ

AICC Meenakshi Natarajan: నియోజకవర్గాల్లో సమన్వయ సమస్య.. మీనాక్షి నటరాజన్ సీరియస్

AICC Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీ కోల్డ్ వార్‌లు ఇంకా సమిసిపోలేదు. పార్టీలో నేతలంతా కలిసి పనిచేయాల్సిందేనని, సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని ఇటీవల ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ లు సూచించినా, నేతల్లో మార్పు రావడం లేదు. ‘‘చెడును చెవిలో చెప్పాలి, మంచి మైక్ లోనే చెప్పాలి”అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతలందరినీ కోరారు. కానీ సమన్వయం సెట్ కాక, లీడర్ల మధ్య నిత్యం పంచాయితీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిల మధ్య వైరుధ్యం మరోసారి బయట పడింది. కార్యకర్తల ముఖ్య సమావేశంలో ఇరు వర్గాల మధ్య వార్ నెలకొన్నది.

చివరికి ఖైరతాబాద్ డీసీసీ జోక్యం చేసుకొని సర్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త మంత్రులు ఏర్పాటు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరి పెత్తనం అవసరం లేదని, తానే బాస్ ను అంటూ స్వయంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తేల్చి చెప్పారు. ఇవన్నీ కోల్డ్ వార్ సంకేతాలను సూచిస్తున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 కు పైగా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉన్నట్లు పీసీసీ గుర్తించింది. ఈ సమస్యలకు చెక్ పెట్టకపోతే నష్టం జరుగుతుందని ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ నేతలకు సీరియస్ అయ్యారు.

జడ్చర్లపై ఫిర్యాదు?

జడ్చర్ల నియోజకవర్గంలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కుదరడం లేదని ఏఐసీసీ ఇన్ చార్జ్ కు ఫిర్యాదు అందింది. ఈ నియోజకవర్గంలో రెండు వర్గాలుగా కార్యకర్తలు చీలిపోయారని, స్థానిక ఎమ్మెల్యే తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదంటూ మీనాక్షికు కంప్లైంట్ అందింది. తాము మొదట్నుంచి పార్టీ కోసం పనిచేశామని, కానీ తమ ఎమ్మెల్యే తమను ఓ ఎంపీ అనుచరులనే కారణంతో పక్కకు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్యను నోట్ చేసుకున్న ఏఐసీసీ ఇన్ చార్జ్, త్వరలోనే రివ్యూ పెడతానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Also Read: Politician: రాబోయే 3 నెలల్లో ప్రముఖ రాజకీయ నేత మృతి.. ఇంతకీ ఎవరది?

ఇక బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మొదట్నుంచి పార్టీలో ఉన్నామని ఇన్ చార్జీ అండ్ టీమ్, హైకమాండ్ ఆదేశాలతోనే పార్టీలో చేరామని ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అండ్ ఫాలోవర్స్..తమ మార్క్ ను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల ప్రోటోకాల్, డెవలప్ మెంట్ కార్యక్రమాలు, పార్టీ రివ్యూస్ లో ఫైట్స్ జరుగుతున్నాయి.

స్క్రీనింగ్ రివ్యూ..?

పార్టీ ఏజెండాను అమలు చేయడం నేతల బాధ్యత అని పీసీసీ చీఫ్​వివరిస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అందరూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన నొక్కి చెప్తున్నారు. ఇదే అంశంపై నేతలందరికీ అవగాహన సదస్సు, స్క్రీనింగ్ రివ్యూ పెట్టాలని పీసీసీ ఆలోచిస్తున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు, డీసీసీలు, ఇతర కీలక నేతలతో నిర్వహించాలని భావిస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నట్టు పీసీసీకి వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి.

దీంతో సీరియస్ గా సమన్వయం మీటింగ్ ను ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు నేతల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం, గ్రూప్ వివాదాలకు వంటి ఇష్యూలకు చెక్ పెట్టకపోతే స్థానిక సంస్థల్లో నష్టం జరుగుతుందని పార్టీ భావిస్తున్నది. నేతల కో ఆర్డినేషన్ పై తాను స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తానంటూ ఇప్పటికే ఏఐసీసీ ఇన్ చార్జీ పార్టీలోని అందరికీ ఆదేశాలిచ్చారు.

Also Read: Plane Tragedy: విమానంలో ఆటో డ్రైవర్ కూతురు.. గుండె తరుక్కుపోయే విషాదం

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?