Politician: ఈ ప్రపంచంలో అంతుపట్టిన విషయాల్లో మరణం ఒకటి. అప్పటివరకూ ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలి అనంత లోకాలకు వెళ్లడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. స్కూల్ పిల్లాడి నుంచి పండు ముసలి వ్యక్తి వరకు ఎవరినీ ఎప్పుడు చావు పలకరిస్తుందో చెప్పడం అసాధ్యంగా మారిపోయింది. అయితే కొందరు పండితులు మాత్రం హిందూ శాస్త్రాల ఆధారంగా మరణాలను ముందుగానే అంచనా వేస్తుంటారు. తాజాగా జరిగిన అహ్మాదాబాద్ విమాన ప్రమాదంలో ఇదే విషయం రుజువైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ పండితుడు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? జరిగిన విమాన ప్రమాదానికి అతడి మాటలకు ఉన్న లింకేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
స్వామిజీ ఏం చెప్పారు?
ఐదు వారాల క్రితం ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ స్వామిజీ మాట్లాడారు. పహాల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా వచ్చే మూడు నెలల్లో పెద్ద న్యూస్ వినిపిస్తుందని అన్నారు. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న వారే మరణించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. షష్టగ్రహ కూటమి మొదలైన నేపథ్యంలో ఈ విపత్కర పరిణామం చోటుచేసుకునే అవకాశముందని ఆస్ట్రాలజీ సూచిస్తోందని అన్నారు.
విమాన ప్రమాదంతో లింకప్!
అహ్మాదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు సైతం ధ్రువీకరించాయి. అయితే గతంలో సదరు స్వామిజీ చేసిన వ్యాఖ్యలను.. తాజాగా చోటుచేసుకున్న విజయ్ రూపానీ మరణంతో నెటిజన్లు లింకప్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో పెద్ద న్యూస్ వింటారని స్వామిజీ చెప్పిన విషయం.. విమాన ప్రమాదమే అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రముఖ రాజకీయ నాయకుడు మరణిస్తాడని ఆయన చెప్పినట్లు గుజరాత్ మాజీ సీఎం మరణించారని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Sambasiva Rao on Kaleshwaram: కాళేశ్వరం పనికిరాదు.. ప్రాజెక్ట్ రద్దు చేయాలి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
తెలుగు నేత కూడా కావొచ్చు!
అయితే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ చేసిన వ్యాఖ్యలను మరికొందరు నెటిజన్లు మరో రకమైన అర్థం చెబుతున్నారు. ఆయన 5 వారాల క్రితం చెప్పింది తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేత గురించి అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రాబోయే మూడు నెలలు అన్నారు కాబట్టి.. ఇంకా 2 రెండు నెలల కాలం మిగిలే ఉందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల హైదరాబాద్ జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి శ్రీనివాస్ మరణాన్ని కూడా ఆయన ముందే ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. మెుత్తం మెుతం బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ చేసిన కామెంట్స్ తాజాగా సంచలనం రేపుతుండటం ఆసక్తి కరంగా మారింది.