Plane Crashes In India: గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది సహా 242 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం ఉండటం రాజకీయంగా మరింత సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదం ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారంతా చనిపోయినట్లు అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే దేశంలో ఈ తరహా ఘోర విమాన ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. దేశ చరిత్రలో ఈ తరహా విషాదాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
1978 జనవరి 1, బాంబే ఎయిర్ క్రాష్
ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 747 బాంబే ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన తర్వాత అరేబియా సముద్రంలో క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో 213 మంది మరణించారు.
1982 జూన్ 21, బాంబే ఎయిర్ క్రాష్
ఎయిర్ ఇండియా విమానం 403 బాంబే విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు.
1988 అక్టోబర్ 19, అహ్మదాబాద్ ఘటన
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 113 అహ్మదాబాద్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 133 మంది మృతి చెందారు.
1990 ఫిబ్రవరి 14, బెంగళూరు ప్రమాదం
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 605, ఎయిర్ బస్ ఏ320 బెంగళూరుకు చేరువలో కుప్పకూలింది. ఈ ఘటనలో 92 మంది చనిపోయారు.
1991 ఆగస్ట్ 16, ఇంఫాల్ ఘటన
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 257 ఇంఫాల్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో 69 మంది మరణించారు.
1993 ఏప్రిల్ 26, ఔరంగాబాద్ ప్రమాదం
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 491, బోయింగ్ 737 ఔరంగాబాద్ నుండి టేకాఫ్ అయిన తర్వాత కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 55 మంది చనిపోయారు.
Also Read: Plane Crash: మాజీ సీఎం కన్నుమూత.. పొలిటికల్ హిస్టరీ పెద్దదే!
1996 నవంబర్ 12, చర్ఖీ దాదాద్రి జంక్షన్
సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఇల్యుషిన్ ఇల్ 76 విమానం ఢిల్లీ సమీపంలో గాలిలోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 349 మంది చనిపోయారు.
2000 జులై 17, పాట్నా ఎయిర్ క్రాష్
అలయన్స్ ఎయిర్ ఫ్లైట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పాట్నాలో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు.