Vijay Rupani
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Plane Crash: మాజీ సీఎం కన్నుమూత.. పొలిటికల్ హిస్టరీ పెద్దదే!

Plane Crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) కన్నుమూశారు. ఈ విషయాన్ని గుజరాత్ (Gujarat) బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. విమాన ప్రమాదంలో విషాదకర రీతిలో విజయ్ రూపానీ కన్నుమూశారని అన్నారు. ఆయన మరణం కలచివేస్తోందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘మాజీ సీఎం విజయ్ రూపానీ ఇక లేరు. బీజేపీ కుటుంబం తీవ్ర విచారంలో ఉంది. విమాన ప్రమాదంలో చనిపోయినవారందరి ఆత్మలకు శాంతిని కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ధైర్యం కలగజేయాలని కోరుకుంటున్నాం’’ అని పాటిల్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

లండన్‌లో రూపానీ భార్య
విజయ్ రూపానీ భార్య అంజలీ రూపానీ లండన్‌‌లో ఉండడంతో ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకే ఆయన లండన్ బయలుదేరారని తెలుస్తోంది. కానీ, విషాదకర రీతిలో అహ్మదాబాద్‌లో విమానం బయలుదేరిన 5 నిమిషాల్లోనే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూపానీ మృతిపై బీజేపీ శ్రేణులు తీవ్ర వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ నేతలు మొదలుకొని, అన్ని రాష్ట్రాల చీఫ్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

Read this- Plane Crash: నిజంగా మిరాకిల్.. మృత్యుంజయుడు కాకపోతే మరేంటి?

గుజరాత్ 16వ సీఎంగా బాధ్యతలు
విజయ్ రూపానీ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే, 1956 ఆగస్టు 2న రంగూన్‌లో (ప్రస్తుతం యంగూన్, మయన్మార్) జన్మించారు. దేశంలోని కీలక రాజకీయ నాయకులలో ఒకరు. బీజేపీలో ముఖ్యనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్‌‌కు 16వ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్ 2021 వరకు ఐదేళ్లపాటు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కీలక పదవులు చేపట్టారు. 1996-97 కాలంలో రాజ్‌కోట్ మేయర్‌గా, 2006-2012 వరకు రాజ్యసభ ఎంపీగా, ఆ తర్వాత గుజరాత్ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. రవాణా శాఖ, కార్మిక శాఖ, నీటి సరఫరా శాఖలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. రాజ్‌కోట్ వెస్ట్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ఆయన ప్రాతినిధ్యం వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవి దక్కడానికి ముందు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు.

బల్వంత్ రాయ్ తర్వాత రూపానీ
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బల్వంత్ రాయ్ మెహతా 1965 సెప్టెంబరు 19న విమాన ప్రమాదంలో మృతి చెందారు. పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో గుజరాత్ నుంచి మిఠాపూర్‌ వెళ్తుండగా పాకిస్థాన్ ఈ విమానాన్ని కూల్చివేసింది. ఈ ప్రమాదంలో మెహతా భార్య, సహాయకులు, ఒక జర్నలిస్ట్ కూడా కన్నుమూశారు. బల్వంత్ రాయ్ తర్వాత విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ ప్రముఖ రాజకీయ నాయకుడిగా విజయ్ రూపానీ నిలిచారు.

Read this- Plane Crash: విమాన ప్రమాదం బాధాకరం.. టాలీవుడ్ నటుల స్పందనిదే!Read this-

Just In

01

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు