Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎంతో హృదయ విదారకమైన విషయమని, మృతుల ఆశ్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది.. మొత్తంగా 242 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య నిమిషనిమిషానికి పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదంపై దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులెందరో స్పందిస్తూ, విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన నటులు ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Also Read- Trivikram Srinivas: ట్విస్ట్ అదిరింది.. అల్లు అర్జున్, రామ్ చరణ్ అవుట్.. ఎన్టీఆర్ ఫిక్స్!
Devastated to hear about the horrifying tragedy involving the Flight #AI171 bound to London from Ahmedabad. No words will suffice to say how heartbreaking this is. My deepest condolences and prayers to the families of the departed! May their souls rest in peace! 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2025
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఫ్లైట్‌కి సంబంధించిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధగా ఉంది. ఇది ఎంత హృదయ విదారకమైన ఘటనో చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. – చిరంజీవి
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లండన్ నగరానికి 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడం ఊహించలేకపోతున్నాను. అది కూడా వైద్య కళాశాల వసతి భవనం మీద కూలడం మహా విషాదంగా మారింది. ఈ దుర్ఘటనలో మృతులకు, వాళ్ల కుటుంబాలకు దేశం బాసటగా ఉండాల్సిన సమయమిది. – పవన్ కళ్యాణ్
గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం ఓ ఘోర దుర్ఘటన. మాటలకందని విషాదమది. యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశస్తులూ మృతిచెందడం బాధాకరం. ప్రయాణీకులతో పాటు సిబ్బంది.. విమానం కూలినచోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోంది. ఈ జాతీయ విపత్తులో ప్రతి ఒక్కరం కేంద్రానికి బాసటగా నిలుద్దాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. – నందమూరి బాలకృష్ణ

అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మహా విషాదం నన్నెంతగానో కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారికి బలం, శాంతి, స్వస్థత చేకూరాలని కోరుకుంటున్నాను. – మహేష్ బాబు
Deeply saddened to know about the unfortunate plane crash in Ahmedabad.
My prayers are with all the passengers, crew on board, the affected and their families.— Ram Charan (@AlwaysRamCharan) June 12, 2025
అహ్మదాబాద్‌లో జరిగిన దురదృష్టకర విమాన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది, ప్రభావితమైన వారందరితో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రార్థనలు. – రామ్ చరణ్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగోట్టుకున్న ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మనసంతా మీ దగ్గరే ఉంది. – జూనియర్ ఎన్టీఆర్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వార్త నన్ను చాలా బాధించింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా గుండెలు పిండే విషాదం. – అల్లు అర్జున్
ఇంకా మంచు విష్ణు, సాయి దుర్గ తేజ్, శివాజీ, విజయ్ ఆంటోని, నభా నటేష్, రామ్ పోతినేని వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా ఈ విషాద ఘటనపై స్పందించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు