Kubera Producers: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’ (Kubera Movie). సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ‘పోయిరా మామ’, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, ‘పీపీ డమ్ డమ్’ సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతుండగా, చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. వారు మాట్లాడుతూ..
‘‘శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పారు. ఈ కథకు ధనుష్ అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ 20 నిమిషాలు ఈ కథ విని వెంటనే సైన్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేశాము. ధనుష్ పాన్ ఇండియా స్టార్. డైరెక్టర్‌గా హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున కూడా ఎప్పటి నుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. ఇక రష్మిక గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇండియాలోనే ఆమె పాపులర్ యాక్ట్రెస్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌తో ఈ సినిమాను చేయడం జరిగింది. ధనుష్, నాగార్జున, రష్మిక అందరూ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశారు. కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో మాత్రం డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాము. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ పూర్తయింది. సినిమా అద్భుతంగా వచ్చింది. శేఖర్ కమ్ముల మాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఆయన ‘లీడర్’ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్‌తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్‌కి ఈ సినిమా న్యూ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ మధ్యకాలంలో ఇలాంటి డిఫరెంట్ ఫిల్మ్ రాలేదని చెప్పగలము. శేఖర్ కమ్ముల స్టార్స్‌ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా అందరికీ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి.
Also Read- Tollywood: పవన్ కళ్యాణ్ లేఖ పని చేస్తోంది.. ఏపీ సీఎం చెంతకు సినీ ఇండస్ట్రీ!
కుబేర కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే.. ‘మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్’ ఇదే కాన్ఫ్లిక్ట్. శేఖర్ కమ్ముల మంచి ఎమోషన్స్‌తో ప్రేక్షకులని టచ్ చేస్తూ.. డీప్‌గా ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతాయి. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం.. రియల్ లొకేషన్స్‌లోనే చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్‌లో తీశాం. ముంబైలో సినిమాని సూట్ చేయడం మాకు మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని షూట్ చేయడం జరిగింది. అది ఇంకా రియల్ ఛాలెంజ్. మేము బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్‌కు కావలసిన బడ్జెట్‌ని పెట్టాం. ఆ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘కుబేర’ సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ కానుంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకంతో ఉన్నాం.

కింగ్ నాగార్జునతో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ కమ్ములకు కూడా ఈ పాత్ర కోసం నాగార్జున తప్పితే మరొకరు కనిపించలేదు. నాగార్జునకు కూడా ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన తప్పితే మరొకరు ఆ పాత్రలో చేయలేరనేంత గొప్పగా పెర్ఫార్మ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆయన చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇందులో ధనుష్ రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్, దేవిశ్రీ కలెక్టివ్ డెసిషన్. తమిళ్‌లో ఈ చిత్రాన్ని మేము రిలీజ్ చేయడం లేదు. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చాం. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ శేఖర్ కమ్ములతోనే ఉంటుంది. ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు. త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు