Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విషయంలో నెలకొన్న గందరగోళంపై, అలాగే సినిమా ఇండస్ట్రీలో పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఏపీలో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. సినిమా ఇండస్ట్రీ తరపున పెద్దలందరూ వచ్చి కొన్ని పాలసీల గురించి మాట్లాడాలని డిప్యూటీ సీఎం కోరినా, ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు హీరోలు, ఆయా సినిమాల నిర్మాతలు కాకుండా.. ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ మాత్రమే వచ్చి కలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినా కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఇక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించకుండా సాగదీసుకుంటూ వచ్చి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల టైమ్‌లో థియేటర్ల బంద్‌కు పిలుపునివ్వడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ సీరియస్‌గా రియాక్ట్ అయిన విషయం తెలిసిందే.
Also Read- Singer Mangli Controversy: బర్త్‌డే పార్టీ కాంట్రవర్సీ.. సింగర్ మంగ్లీ షాకింగ్ కామెంట్స్!
ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ లేఖను విడుదల చేస్తూ.. రిటర్న్ గిఫ్ట్ అదిరింది అంటూ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేసినప్పటి నుంచి ఇండస్ట్రీలో మార్పులు మొదలయ్యాయి. ‘ఆ నలుగురు’ అనే వాళ్లు ఎవరూ లేరు? ఎవరి దగ్గర ఎన్ని థియేటర్లు ఉన్నాయో? చెబుతూ అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) వంటి వారు మీడియా సమావేశం నిర్వహించారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించారు కూడా. ఆ తర్వాత మరికొందరు నిర్మాతలు కూడా మీడియా సమావేశాల్లో.. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదంటూ చెప్పడం మొదలుపెట్టారు. బన్నీ వాసు అయితే సోషల్ మీడియా వేదికగా సినీ పెద్దలకు కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. ఇన్ని పరిణామాల తర్వాత ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో, సినీ పెద్దల్లో కదలిక వచ్చింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కోరింది ఏంటంటే.. ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు దండాలు పెట్టమని కాదు. సినిమా ఇండస్ట్రీలో మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి, వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, సాల్వ్ చేసుకునేందుకు ప్రభుత్వ మద్ధతుని కోరాలని మాత్రమే చెప్పారు. అయినా కూడా ఒక్కరూ ముందడుగు వేయలేదు.
అందుకే లేఖలో కాస్త కఠినంగా రియాక్ట్ అయ్యారు. అంతే, ఇండస్ట్రీ పెద్దలందరూ ఈ ఆదివారం (జూన్ 15) సీఎం చంద్రబాబు నాయుడుని ఉండవల్లి నివాసంలో కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, ప్రదర్శనకు సంబంధించిన విధి విధానాలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఈ భేటీలో ప్రభుత్వం తరుపున సీఎంతో పాటు ఎవరెవరు పాల్గొంటారు? అలాగే సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి ఎంత మంది పాల్గొంటారు? అందులో ఎవరెవరు ఉంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా అయితే.. చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న అడ్డంకులు, వివాదాలు తొలగిపోయేందుకు ఒక వేదిక, అవకాశం అయితే లభించినట్లయింది. మరి ఈ భేటీ ఎలా జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు