Telangana BJP: మూడు.. మూడు.. ఆరు.. ఏడు.. పన్నెండు.. ఇవి ర్యాంకులు కావు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ(BJP)కి వచ్చిన ఎగ్జిట్ పోల్స్. ఈ అంచనాలు ఎలా ఉన్నా.. ఈ ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని కాషాయ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ను తాము విశ్వసించబోమని టీబీజేపీ(TBJP) చెబుతోంది. అదే బీహార్(Bihar) విషయనికి వస్తే ఎన్టీయే(NDA) కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో దాన్ని సోషల్ మీడియాల్లో తిప్పుతూ హంగామా చేయడం గమనార్హం.
ఉప ఎన్నికల ఫలితాలు
2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి(Lanka Deepak Reddy)కి 25,866 ఓట్లు వచ్చాయి. ఇది 14.11 శాతంగా ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. కాగా ఈ ఉప ఎన్నికల్లో ఆయనే అభ్యర్థిగా ఉన్నారు. కాగా ఈ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి గరిష్టంగా 12 శాతం ఓట్లే పడ్డాయని చెప్పగా అత్యల్పంగ 3.8 శాతమే ఉండటం గమనార్హం. శుక్రవారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? లేక గతంలో వచ్చిన ఓట్ల శాతం కంటే ఎక్కువగా బీజేపీ దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read; Thummala Nageswara Rao: టైంకు రాని అధికారులపై కఠిన చర్యలు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్!
గతంలో వచ్చిన మార్క్‌ను..
సికింద్రాబాద్(Secunderabad)లోక్ సభ పరిధిలో ఉన్న ఎలక్షన్ కావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఈ బైపోల్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో వచ్చిన మార్క్ ను అధిగమిస్తారా? చతికిలపడతారా? అనేది నేడు తేలనుంది. ఏది ఏమైనా ఈ బైపోల్ కిషన్ రెడ్డి పనితీరుకు గీటురాయిగా మారుతుందా? లేదా? అనేది కూడా నేడు తేలనుంది. ఇదిలా ఉండగా రాంచందర్ రావు(Ramchandra Rao) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే. గతంలో ఎన్నో ఎన్నికలకు కీలకంగా వ్యవహరించి గెలుపు తీరాలకు చేర్చిన ఆయన.. ఈ పరీక్షలో నెగ్గుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
