India ODI Squad: టీ20 వరల్డ్ కప్-2026లో ఆడే జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ (BCCI) పూర్తి నమ్మకాన్ని ఉంచింది. మరోసారి వన్డే జట్టు పగ్గాలు అప్పగించింది. జనవరి 11 నుంచి భారత్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ను బీసీసీఐ శనివారం జట్టుని ప్రకటించింది. శుభ్‌మన్ సారధ్యంలో ప్రకటించిన ఈ జట్టులో గాయంతో జట్టుకు దూరమైన రిషత్ పంత్ తిరిగి చోటుదక్కించుకున్నాడు. అంతేకాదు, గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్‌ని కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే, బీసీసీఐ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను బట్టి అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడం ఆధారపడి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్నప్పటికీ వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి మాత్రం మరోసారి మొండిచెయ్యి ఎదురైంది. ఇక, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ జట్టులో చోటుదక్కింది.
న్యూజిలాండ్ సిరీస్‌కు వన్డే జట్టు ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్.
Read Also- Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026

