Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణునే!
Manchu Lakshmi on Mohan Babu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనగానే గుర్తొచ్చే పేరు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu). నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా పేరు గడించిన మోహన్ బాబు.. ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 22న ‘MB50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ పేరిట గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన కుమార్తె మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మమ్మల్ని చాలా క్రమశిక్షణతో మా నాన్న పెంచారని చెప్పిన మంచు లక్ష్మి (Manchu Lakshmi).. తన తండ్రికి, తనకు మధ్య గొడవలు జరగడానికి కారణం మంచు విష్ణునే అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదేదో సీరియస్ ఆరోపణలనో, ఇంకొకటో అనుకుంటారేమో? అదేం లేదు.. మంచు లక్ష్మి (Manchu Lakshmi) చెప్పింది తన చిన్నప్పటి ఇన్సిడెంట్స్ గురించి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే..

Also Read- SS Rajamouli: ఎవరు పడితే వాళ్లు రావడానికి.. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు! గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు వచ్చే దారిదే!

మాకు టార్చర్‌లా ఉండేది

‘‘నాన్న అంటే విష్ణు, మనోజ్ మాత్రమే కాదు.. నేను కూడా భయపడేదాన్ని. చిన్నప్పుడు మమ్మీ అంటే ఎక్కువగా భయం ఉండేది. నాన్న మాత్రం స్ట్రిక్ట్‌గా ఉండేవారు. ప్రతీది టైమ్ టేబుల్ పెట్టి, ఆ టైమ్‌కు అన్ని జరుగుతున్నాయా? లేదా? అని తెలుసుకుంటూ ఉండేవారు. మా కోసం అప్పట్లో ఒక మేనేజర్ కూడా ఉండేవారు. ఎంత షూటింగ్ చేసినా, మేము ఏం చేస్తున్నామనేది.. ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండేవారు. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. మాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలని.. అన్ని రకాల బుక్స్ తెప్పించేవారు. అలాంటి బుక్స్ నేను ఎవరింట్లో చూడను కూడా చూడలేదు. అదే మాకు టార్చర్‌లాగా ఉండేది. రోజూ.. ఈ రోజు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చదువు అని రాసి వెళ్లేవారు. మేం కొట్టుకోకుండా.. తలా ఒక బుక్ ఇచ్చేవారు. అసలు అంత బిజీలో కూడా మమ్మల్ని ఎలా అలా పట్టించుకునేవారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకున్న బిజీకీ.. ఒక్కోసారి నేను నా పాపను కూడా మరిచిపోతున్నాను.

Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

నాన్నతో సగం ఫైట్ అందుకే..

ఇంట్లో ఫస్ట్ పుట్టే పిల్లలపై ప్రయోగాలు ఎక్కువగా చేస్తుంటారు. తల్లిదండ్రులకు ఒక ఐడియా ఉంటుంది.. మన పిల్లలు ఇలా ఉండాలి, ఇలా పెరగాలి అని. మనం చేయలేకపోయినవి, మన పిల్లలతో చేయించాలని, చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. సెకండ్ వాళ్లపై అంత ఉండదు. మూడో సంతానాన్ని అసలు పట్టించుకోరు. మొదట పుట్టిన వాళ్లపైనే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ. అందులో మా నాన్న చాలా స్ట్రిక్ట్. ఆడపిల్లంటే పద్ధతిగా ఉండాలి.. ఇలా ఉండాలి, అలా ఉండాలని రూల్స్ పెట్టేశారు. నాకు నాన్నతో సగం ఫైట్ అక్కడే స్టార్ట్ అయింది. అదేంటి వాడు (విష్ణు) చేసింది, నేనెందుకు చేయకూడదు? అని ఫైట్ చేసేదాన్ని. ఒక రూల్ పెట్టినప్పుడు అందరికీ వర్తించాలి. వాడికో రూల్, నాకో రూల్ ఏంటి? వాడు చేసిన దానికంటే నేను పది రెట్లు ఎక్కువ చేయగలను.. అని చెప్పేదాన్ని. ఇప్పుడు నా భర్తతో కూడా అదే చెబుతాను. నేను చేయగలనో లేదో అనేది నాకు వదిలేయండి. నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. నిజం బయటకు రాకుండా ఉండదు. నువ్వు ఎంత దాచి పెట్టినా, ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. అది తెలుసుకుని జీవించాలి’’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nandini Suicide: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని.. ఎందుకంటే?

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి