Sudheer Reddy Arrest: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన కొడుకు సుధీర్ రెడ్డిని తెలంగాణ ఈగల్ టీమ్ శనివారం అరెస్ట్ (Sudheer Reddy Arrest) చేసింది. గంజాయి సేవించినట్టుగా తేలడంతో అదుపులోకి తీసుకొని, డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. గంజాయి పాజిటివ్ వచ్చిందని ఈగల్ టీమ్ అధికారులు తెలిపారు. కాగా, సుధీర్ రెడ్డి గతకొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ వినియోగం విషయమై సమాచారం అందడంతో ఈగల్ టీమ్ సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో ఇంట్లో ఆయనతో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అయితే, ఒక్క సుదీర్ రెడ్డికి మాత్రమే గంజాయి పాజిటివ్ వచ్చింది. మిగతా ఇద్దరికీ టెస్టులు చేసినప్పటికీ నెగిటివ్‌గా తేలింది. దీంతో, సుధీర్ రెడ్డిని డీ అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
ఇక, సోదాల సమయంలో డ్రగ్స్, గంజాయి, ఇతర ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకాలేదని ఈగల్ టీమ్ అధికారులు చెబుతున్నారు. డిప్రెషన్ కారణంగానే సుధీర్ రెడ్డి డ్రగ్స్‌కు అలవాటు పడినట్టుగా తెలిసిందన్నారు. ఈ సమాచారాన్ని అతడి కుటుంబ సభ్యులకు ఇచ్చామని పేర్కొన్నారు. కాగా, సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండు సార్లు డ్రగ్స్ సేవించి దొరికాడు. కాగా, సుధీర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.
Read Also- Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?

