Ajith-Doval
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Threat to Ajit Doval: కెనడా లేదా, అమెరికా రా.. అజిత్ ధోవల్‌కు ఖలిస్థానీ తీవ్రవాది పన్నున్ బహిరంగ వార్నింగ్

Threat to Ajit Doval: కెనడా వేదికగా ఖలిస్థానీ ఉగ్రవాదుల దుశ్చర్యలు ఎక్కువైపోతున్నాయి. నిషేధిత ఆ సంస్థకు చెందిన తీవ్రవాది ఇందర్జీత్ సింగ్ గోసల్‌ ఇటీవల మారణాయుధాలు కలిగివున్న కారణంగా అరెస్టయ్యాడు. అయితే, కొన్ని రోజులకే బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన వెంటనే నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థకు ప్రధాన న్యాయ సలహాదారుగా ఉన్న తీవ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌ను ఇందర్జీత్ సింగ్ గోసల్ కలిశాడు. అనంతరం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను, భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా (Threat to Ajit Doval) బెదిరించాడు. ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని అతడు విడుదల చేశాడు.

ఆ వీడియోలో తీవ్రవాది గోసల్ జైలు నుంచి విడుదలై బయటకు వస్తుండడం కనిపించింది. వస్తూనే, తన అరెస్ట్‌ చేసేందుకు, భారతదేశానికి అప్పగింత విషయమై దమ్ముంటే ప్రయత్నించాలంటూ దోవల్‌కు సవాలు విసిరాడు. ‘‘ అజిత్ ధోవల్, నువ్వు కెనడా లేదా, అమెరికా, ఇతర యూరోప్ దేశాలకు ఎందుకు రావడం లేదు. ఇక్కడి రా.. వచ్చి నా అరెస్ట్, భారతదేశానికి అప్పగింత కోసం ప్రయత్నించు. ఇండియా, నేను బయటకు వచ్చేశాను. గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌కు మద్దతుగా, నవంబర్ 23న ఖలిస్తాన్ రిఫరెండం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని ఇందర్జీత్ సింగ్ గోసల్ సవాలు విసిరాడు. పన్నున్ స్పందిస్తూ, అజిత్ దోవల్ ఇక్కడి వచ్చి అరెస్ట్ చెయ్యాలని అన్నాడు. తాను ఎదురుచూస్తుంటానని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా, గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్‌ను ఇప్పటికే భారత ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డాడు.

Read Also- BSNL 4G: ప్రధాని మోదీ చేతులు మీదుగా రెండు కీలక కార్యక్రమాలు.. శనివారమే ప్రారంభం

భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తానీని ప్రేరేపిస్తున్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇటీవలే పన్నున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదైన కొన్ని రోజుల వ్యవధిలోనే అతడి నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. పన్నున్, ఈ ఏడాది భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీని జాతీయ పతాక ఆవిష్కరణ చేయకుండా ఎవరైనా ఆపితే వారికి రూ.11 కోట్లు బహుమతి ఇస్తానంటూ ప్రకటించాడు. దీనిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.

Read Also- Fan Emotional Video: దేవుడి కోసం సాధించండి.. స్టేడియంలో పాక్ ఫ్యాన్ ఎమోషనల్.. భారత్‌పై ఇంత కసి ఉందా?

ఇందర్‌జీత్ సింగ్ గోసల్‌పై ఆయుధాల కేసులు

కెనడాలోని ఓషావా సమీపంలో సెప్టెంబర్ 19న ఖలిస్తానీ తీవ్రవాది ఇందర్జీత్ సింగ్ గోసల్‌ను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నెండు ఆయుధాల కలిగివుండడంతో కేసులు నమోదు చేశారు. వీటిలో లైసెన్సు లేని ఆయుధాలు కూడా ఉన్నాయి. దీంతో, చట్ట విరుద్ధంగా తుపాకీ వినియోగం, దాచిపెట్టిన ఆయుధంతో సంచరించడం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ సమయంలో ఇందర్జీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు కూడా అతడి వెంట ఉన్నారు. టొరంటోకు చెందిన అర్మన్ సింగ్ (23), న్యూయార్క్ పిక్‌విల్లేకు చెందిన జగ్‌దీప్ సింగ్ (41) ఉండగా, వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Just In

01

Ind Vs SL: భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. టీమిండియాలో భారీ మార్పులు

Hyderabad Rains: జంట జలాశయాలకు పోటెత్తిన వరద.. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్!

Metro Fest 2025: దసరా స్పెషల్.. మెట్రోలో ఫ్రీ ఫుడ్ స్టాల్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్.. హైదరాబాదీలకు పండగే!

Gadwal Farmers: గద్వాల జిల్లాలో పత్తి రైతుల కష్టాలు.. అధిక వర్షాలతో ఎర్రబారుతున్న పంటలు

Viral News:హెల్త్ బాలేక ఒక్క రోజు లీవ్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగికి హెచ్చార్ నుంచి అనూహ్య మెసేజ్