Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు
Attack-On-constable (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్

Lady Constable: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) రాయ్‌గఢ్ (Raigarh) జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న నిరసనకారులు, ఓ లేడీ కానిస్టేబుల్ పట్ల అమానవీయ రీతిలో (Lady Constable) ప్రవర్తించారు. డ్యూటీలో ఉన్న ఆమె దుస్తులను చింపివేశారు. దుస్తులు చించవద్దని, తనను వదిలిపెట్టాలంటూ బాధితురాలు ఎంత వేడుకున్నా వారు కనికరించలేదు. గత నెల డిసెంబర్ 27న ఈ ఘటన జరగగా, జనవరి 1న (గురువారం) ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. లేడీ కానిస్టేబుల్‌పై జరిగిన ఈ దాడికి సంబంధించిన ఈ వీడియో సంచలనంగా రేకెత్తిస్తోంది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరి అరెస్ట్..

లేడీ కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు రాయ్‌పూర్ పోలీసులు ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దర్ని అరెస్ట్ చేశామని, ఈ నేరంలో ప్రమేయం ఉన్న మిగతా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. రాయ్‌పూర్ జిల్లాలోని తమ్నార్ బ్లాక్‌లో ఈ ఘటన జరిగిందని, 14 గ్రామాలకు చెందినవారు బొగ్గు మైనింగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారని వెల్లడించారు. అయితే, నిరసన వద్ద లేడీ కానిస్టేబుల్ ఒంటరిగా మిగిలిపోయారని, అందుకే, నిరసనకారులు దాడి చేశారని పోలీసులు వివరించారు.

నేలపై పడిపోయి వద్దని వేడుకున్నా…

నిరసనకారుల దాడి సమయంలో లేడీ కానిస్టేబుల్ నేలపై పడిపోయారు. ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆమె దుస్తులను చింపి, లాగేశారు. దుస్తులను చింపవద్దంటూ రెండు చేతులు ఓడించి వేడుకున్నా ఇద్దరు వ్యక్తులు అస్సలు కనికరం చూపలేదు. తాము నిరసన తెలిపే దగ్గర ఎందుకు ఉన్నావో చెప్పు అని ప్రశ్నిస్తూ గట్టిగట్టిగా అరుస్తూ బెదిరించారు. దీంతో, బాధిత కానిస్టేబుల్ భయభ్రాంతులకు గురయ్యారు. ‘దుస్తులు చింపవద్దు భయ్యా. నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఎవరినీ కొట్టను’’ అంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఏడుస్తూనే ఉన్నా ఓ ఇద్దరు వ్యక్తులు జాలిచూపలేదు. ఒకరు దుస్తుల లాగుతుండగా, మరొకరు వీడియో తీయడం వైరల్‌గా మారిన వీడియోలో కనిపించింది.

Read Also- Budget 2026: దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ ప్రకటనకు డేట్ ఫిక్స్.. ఈ ఏడాది ఎప్పుడంటే?

అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారిద్దరూ ఇచ్చిన స్టేట్‌మెంట్, డిజిటల్ ఎవిడెన్స్‌ను బట్టి మరికొందరు నిందితులను గుర్తిస్తున్నట్టు బిలాస్‌పూర్ రేంజ్ ఐజీ సంజీవ్ శుక్లా ప్రకటించారు. నిందితులపై వేధింపులు, హత్యాయత్నం, దోపిడీ, ఇతర నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, ఈ దారుణ ఘటనపై ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్లర్ చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కనీసం పోలీసులుగా ఉన్న మహిళలకు కూడా రక్షణ లేదని, ఇక సామాన్య ప్రజలు పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించింది. డబుల్ ఇంజిన్ సర్కార్‌గా చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించింది.

Read Also- Kavitha Kalvakuntla: అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే.. బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు.. కవిత సంచలన వ్యాఖ్యలు

Just In

01

Musi River: త్వరలో మూసీ ప్రక్షాళన!.. మొదటి దశలో ఎన్ని కి.మీ. చేస్తారంటే?

Tiger Panic: మళ్లీ పులి కలకలం.. ఉలిక్కిపడ్డ కొత్తగూడ ఏజెన్సీ

PhD on Nifty 50: నిఫ్టీ-50పై పీహెచ్‌డీ.. డాక్టరేట్ సాధించిన తెలుగు వ్యక్తి

Oppo Find X9s: 7,000mAh బ్యాటరీతో Oppo Find X9s..

Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్