Fan Emotional Video: తొలుత బాయ్‌కాట్ డిమాండ్లు, ఆ తర్వాత ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం, అనంతరం పరస్పరం ఆటగాళ్ల మీద ఐసీసీకి ఫిర్యాదులు… ఇలా ఆసియా కప్-2025లో దాయాదులు భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ రెండింటిలోనూ టీమిండియా ఘనవిజయాలు సాధించింది. ఇక, ముచ్చటగా మూడోసారి ఇరు జట్లు ఫైనల్ పోరులో తలపడబోతున్నాయి. గురువారం రాత్రి బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన పాకిస్థాన్ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ గెలుపులో ఆ జట్టు స్టార్ పేసర్లు షాహిన్ ఆఫ్రిదీ, హారిస్ రౌఫ్ కీలక పాత్ర పోషించారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో, 136 పరుగుల స్పల్ప లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే సాధించింది. కాగా, బంగ్లాపై గెలుపు అనంతరం, పాక్ పేసర్ హారిస్ రౌఫ్ స్టాండ్స్ వద్దకు వెళ్లి పలువురు పాకిస్థాన్ అభిమానులతో కరచాలనం చేశాడు. ఆ సమయంలో అక్కడ ఓ భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది.
భారత్‌పై ప్రతీకారం తీర్చుకోండి
హారిస్ రౌఫ్‌తో కరచాలనం చేసిన ఓ పాకిస్థాన్ వీరాభిమాని తీవ్రంగా ఎమోషనల్ అయ్యాుడ. కన్నీళ్లు పెట్టుకొని.. ‘‘ఇండియాపై ప్రతీకారం తీర్చుకోవాలి. భారత్‌ను వదిలిపెట్టొద్దు. దేవుడి కోసం సాధించండి’’ అంటూ హారిస్ చేయిపట్టుకొని ఆ అభిమాని విజ్ఞప్తి చేశాడు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు అభిమాని నుంచి కొంచెం వెనక్కి వెళ్లిన హారిస్ రౌఫ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆనందపరిచాడు.
Read Also- Bigg Boss Telugu Promo: వైల్డ్ కార్డు దివ్యతో బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్.. టాప్‌లోకి దూసుకొచ్చిన భరణి!
వివాదాలకు కేంద్ర బిందువుగా హారిస్ రౌఫ్
కాగా, ఆసియా కప్-2025లో పేసర్ హారిస్ రౌఫ్ వివాదాలకు కేంద్రబిందువుగా మారాడు. సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. భారత అభిమానులు ‘కోహ్లీ, కోహ్లీ’ అంటూ నినాదాలు చేశారు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా హారిస్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ సిక్సర్లను గుర్తు చేస్తూ భారత అభిమానులు హేళన చేశారు. అభిమానులకు ప్రతిస్పందనగా భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందన్నట్టుగా హావభావాలు వ్యక్తం చేశాడు. ఈ చర్య పరోక్షంగా భారత సైనిక బలగాలను అవమానించినట్టు అయింది.
అదే మ్యాచ్‌లో హారిస్ మరో వివాదానికి కూడా తెరతీశాడు. అతడి బౌలింగ్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చక్కటి బౌండరీ బాదాడు. దీంతో, రౌఫ్ అక్కసు వెళ్లగగ్గాడు. భారత ఆటగాళ్లపైకి పదేపదే దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు అసభ్య పదజాలం వాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ ఇద్దరూ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ చుక్కలు చూపించారు.
A fan told Haris Rauf after reaching the final: ‘India ko nahi chhodna, badla chahiye’ 😂 #INDvsPAK pic.twitter.com/nyAdDNWtMM
— CineSportsX (@SportsCraft381) September 26, 2025
A fan told Haris Rauf after reaching the final: ‘India ko nahi chhodna, badla chahiye’ 😂 #INDvsPAK pic.twitter.com/nyAdDNWtMM
— CineSportsX (@SportsCraft381) September 26, 2025