Pakistan Saudi: పాకిస్థాన్-సౌదీఅరేబియా (Pakistan Saudi) మధ్య ఇటీవలే కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ అసిస్టెన్స్’ పేరిట జరిగిన ఈ ఒప్పందంలో భాగంగా.. రెండింట్లో ఏ దేశంపై దాడి జరిగినా, ఇరుదేశాలపై జరిగినట్టుగా పరిగణిస్తామనే కీలకమైన మాటను ఒప్పందంలో పొందుపరించారు. మరి, భారత్‌కు కూడా మంచి స్నేహపూర్వకమైన దేశమైన సౌదీఅరేబియా.. ఒకవేళ యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు అండగా ఇండియాకు వ్యతిరేకంగా పోరాడుతుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందించారు.
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటిస్తే, సౌదీ అరేబియా కచ్చితంగా రక్షణగా నిలుస్తుందని ఖ్వాజా ఆసిఫ్ చెప్పారు. ‘‘అవును, ఖచ్చితంగా అండగా నిలుస్తుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు’’ అని ఆయన అన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పాక్-సౌదీ మధ్య ‘స్ట్రాటజిక్ మ్యూచువల్ అసిస్టెన్స్’ జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సౌదీఅరేబియాతో కుదిరిన ఒప్పందం ఏ దేశంపైనా దాడి చేయడానికి కాదని, ‘ఆత్మరక్షణ’కు ఉద్దేశించినదని ఆసిఫ్ స్పష్టం చేశారు. సౌదీఅరేబియాపై గానీ, పాకిస్థాన్‌పై గానీ ఏ దేశమైనా దాడి చేస్తే, ఉమ్మడిగా రక్షించుకుంటామని ‘జియో టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
Read Also- Chamala Kiran Kumar Reddy: మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
సౌదీకి అందుబాటులో అణ్వాయుధాలు
‘‘ఈ ఒప్పందాన్ని మేము ఏ దురాక్రమణ కోసం వాడుకోవాలనే ఉద్దేశం లేదు. కానీ, ఒప్పందంలో ఉన్న మా రెండు దేశాలకు ముప్పు వాటిల్లితే, అప్పుడు ఒప్పందం అమలులోకి వస్తుంది’’ అని చెప్పారు. ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ అణ్వాయుధాలను సౌదీఅరేబియా అందుబాటులో ఉంచుతారా? అనే ప్రశ్నపై ఖ్వాజా అసిఫ్ స్పందించారు. ఈ ఒప్పందం కింద పాకిస్థాన్ శక్తిసామర్థ్యాలు సంపూర్ణంగా సౌదీకి కూడా అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అయితే, తమ అణ్వాయుధ సదుపాయాల తనిఖీలకు ఎప్పుడూ అనుమతి ఇస్తూనే ఉన్నామని, ఇంతవరకు ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన వివరించారు.
Read Also- Tummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. కపాస్ కిసాన్ యాప్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే..!
మరో అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సౌదీకి అణు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పై ఉందా? అని ప్రశ్నించగా, ఇది అన్ని రకాల సైనిక మార్గాలను అందుబాటులో ఉంచుతున్న సమగ్ర రక్షణ ఒప్పందం అని ఆయన ఖ్వాజా అసిఫ్ వివరించారు. కాగా, భారత్-పాకిస్థాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం మూడు రోజుల క్రితమే కుదిరింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ రాజధాని రియాద్ వెళ్లి ఆ దేశ యువరాజు సమక్షంలో సంతకాలు చేశారు. రెండు దేశాల్లో ఏ దేశంపై జరిగినా.. రెండు దేశాలపై దాడిగా పరిగణించబడుతుందని ఒప్పందంలో పేర్కొన్నారు.