Chamala Kiran Kumar Reddy: బీఆర్ ఎస్ ట్రోల్స్ కు తాను భయపడే వ్యక్తిని కానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) వెల్లడించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. ఆ పార్టీ సోషల్ మీడియా(Social Media) ద్వారా తనకు పుల్ పబ్లిసిటీ వస్తుందన్నారు. తాను మాట్లాడిన అంశాల్లో కొంత భాగాన్ని తీసి బీఆర్ఎస్(BRS) పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై బీఆర్ ఎస్ కు అవగాహన లేదన్నారు. బనకచర్ల(Banakacherla) విషయంలో చంద్రబాబు(Chandrababu)ను బూచిగా చూపించారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి(Revanth Reddy) పట్టించుకోవడం లేదని అబద్ధాలను ప్రచారం చేశారన్నారు.
ఎందుకు సైలెంట్ ఉన్నారు?
బనకచర్ల, ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అలసత్వంగా లేదన్నారు. పోతిరెడ్డి పాడు(Pothireddy)కు గండి కొట్టడానికి సహకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని వివరించారు. కృష్ణా(Krishna) నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే పదేండ్లు కేసీఆర్(KCR) ఎందుకు సైలెంట్ ఉన్నారు? అని ప్రశ్నించారు. కర్ణాటక(Krnataka)లో అల్మట్టి ఎత్తు పెంచే విషయం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు ఇప్పుడు 519.16 మీటర్లుందని, 5 మీటర్లు పెంచి 524.25 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
Also Read: Rahul Gandhi: ఉదయం 4 గంటలకు నిద్రలేచి.. 36 సెకన్లలోనే 2 ఓట్లు డిలీట్.. రాహుల్ గాంధీ మరో బాంబ్
మహిళ జిల్లాలైన సాంగ్లి
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నదన్నారు. ఆల్మట్టి ఎత్తు వివాదానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టు(Supreme Court) పరిశీలనలో ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ఎత్తు పెంచే అవకాశం లేదన్నారు.అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచితే కృష్ణా బ్యాక్ వాటర్ తో పశ్చిమ మహిళ జిల్లాలైన సాంగ్లి, కొల్హాపూర్లు ముంపునకు గురవుతాయని, ఇప్పటికే మహారాష్ట్ర(Maharasta) అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. కర్ణాటక వెనక్కి తగ్గకుండా అటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ(Telangana) ప్రయోజనాలను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదని నొక్కి చెప్పారు.
Also Read: Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అక్రమాలు.. మంత్రి ఫుల్ సీరియస్..?