Spain Train Accident: స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కార్డోబా ప్రావిన్స్ లోని అడమూజ్ సమీపంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు స్పెయిన్ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 7.25 గంటల ప్రాంతంలో మలగా నుంచి మాడ్రిడ్ ప్రాంతానికి 317 మంది ప్రయాణికులతో ‘ఐరియో 6189’ రైలు బయలుదేరింది. అడమూజ్ సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా పట్టాలు తప్పి పక్కనే ఉన్న ట్రాక్ మీదకు దూసుకెళ్లిందని రైల్వే మౌలిక సదుపాయాల నిర్వాహక సంస్థ ఆడిఫ్ ఎక్స్ వేదికగా తెలిపింది. అదే సమయంలో ట్రాక్ పై ఎదురుగా మాడ్రిడ్ నుంచి హుయోల్వాకు వెళ్తున్న హైస్పీడ్ రైలు కూడా రావడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ రైలు కూడా పట్టాలు తప్పిందని.. తెలియజేసింది. ఫలితంగా బోగీలలో ఉన్న ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయి గాయపడ్డారని.. కొందరు అక్కడిక్కడే మరణించారని ఆడిఫ్ సంస్థ వివరించింది.
అర్ధరాత్రి వరకూ సహాయక చర్యలు
మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అండలూసియా ప్రాంతం నుంచి రెస్క్యూ బృందాలు హుటాహుటీనా ఘటనా స్థలికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. స్వల్ప గాయాలతో బయటపడ్డవారికి ఘటనా స్థలిలోనే ప్రాథమిక చికిత్సను అందించారు. తీవ్రంగా గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు రెస్క్యూ బృందం ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రస్తుతం 21 మంది మరణించారని.. 73 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వందలాది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకోవడం, రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సహాయక చర్యలు కొనసాగాయని.. రైళ్లు పడిపోవడంతో పట్టాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
Also Read: Gadwal Accident: గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఓకరు మృతి..!
ప్రముఖుల సంతాపం
హైస్పీడ్ రైళ్లు ఢీకొట్టిన ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దేశంలో తీవ్ర విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు. మరోవైపు స్పెయిన్ రాజు ఫెలిపే VI, రాణి లెటిజియా సైతం ప్రమాద ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ఎక్స్ వేదికగా సానుభూతి తెలియజేశారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయల్ మక్రాన్, ఐరోపా యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, తదితర ప్రపంచ నాయకులు సైతం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 2013లోనూ స్పెయిన్ లో ఓ హైస్పీడ్ రైలు పట్టాలు తప్పింది. శాంటియాగో లోని డి కాపోస్టెలా సమీపంలో జరిగిన ఈ ఘటనలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి పైగా గాయపడ్డారు. 1944 తర్వాత స్పెయిన్ లో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాద ఘటన ఇదే కావడం గమనార్హం.
BREAKING NEWS: SPAIN – Adamuz High-Speed Train Derailments: A Preliminary Analysis of the Incident and Response
Abstract
On January 18, 2026, two high-speed passenger trains derailed near Adamuz in Andalusia, Spain, resulting in at least 21 fatalities and over 100 injuries,… pic.twitter.com/PMNe71FhZC
— Vanilla Gorilla (@VanillaGorilaX) January 19, 2026

