Plane Missing: ఇండోనేషియాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. దక్షిణ సులవేసిలో ఓ విమానం అదృశ్యమైంది. ఏటీసీతో దానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో, విమానం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విమానం మిస్సింగ్ సమయంలో 11 మంది ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దక్షిణ సులవేసిలోని పర్వత ప్రాంతంలో జరిగింది. మిస్సింగ్ అయిన విమానం ఒక ప్రాంతీయ ప్యాసింజర్ల విమానమని స్థానిక మీడియా పేర్కొంది. ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు భారీ సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు.
మిస్సింగ్ అయిన విమానం ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థకు చెందిన ‘ఏటీఆర్42-500 టర్బోప్రాప్’ అని, ఇది యోగ్యకర్తా అనే నగరం నుంచి దక్షిణ సులవేసి వెళుతుండగా అదృశ్యమైంది. ఈ ఘటనపై ఇండోనేషియా ప్రభుత్వ ప్రతినిధి ఎండా పూర్ణమ స్పందించారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఈ ఘటన నమోదయ్యిందన్నారు. బులుసారుంగ్ నేషనల్ పార్క్ సమీపంలోని మారోస్ జిల్లా లేంగ్-లేంగ్ పర్వత ప్రాంతం మీదుగా వెళ్తున్న సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయని, రాడార్ నుంచి మిసైందని వివరించారు. విమానం ల్యాండింగ్ అప్రోచ్‌ను సరిచేసుకోవాలంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చివరిసారిగా సూచనలు ఇచ్చింది. ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయని తెలిపారు.
Read Also- Maoist Encounter: మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు పాపారావు మృతి
కూలిపోయిందా?
విమానం కూలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిథిలాలను గుర్తించినట్టుగా స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. మౌంట్ బులుసారుంగ్‌పై విమాన శిథిలాలను చూశామని పర్వతారోహకులు చెబుతున్నారు. ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ లోగో, చిన్నపాటి మంటలను కూడా గమనించామని చెబుతున్నారు. దీంతో, విమానం ఆచూకీ దొరికినట్టేనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమానం కూలే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు, డ్రోన్లు, గ్రౌండ్ యూనిట్ల సాయంతో అన్వేషిస్తున్నారు. రెస్క్యూ టీమ్‌లను కూడా రంగంలోకి దించారు. విమానం ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని అధికారులు ధృవీకరించారని, రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ బాంగున్ నవోకో తెలిపారు. ఈ విమానంలో 8 మంది సిబ్బంది, ముగ్గురు ప్యాసింజర్లు ఉన్నారని వివరించారు. వీళ్లంతా సముద్ర, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు అని చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆకాశం మేఘావృతమై ఉందని, విజిబిలిటీ సరిగా లేదని వివరించారు. దీంతో, అనుకూలంగా లేకపోవడంతో గాలింపు కూడా సంక్లిష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
Read Also- Khammam News: ఖమ్మం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు.. ఈసారి మేయర్ పదవి మళ్లీ..?

