Huzurabad Municipality: హుజురాబాద్‌లో కాక రేపుతున్న రాజకీయం?
Huzurabad Municipality (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Huzurabad Municipality: హుజురాబాద్ మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారుతో.. కాక రేపుతున్న రాజకీయ వేడి..?

Huzurabad Municipality: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. హుజురాబాద్ మున్సిపాలిటీ(Huzurabad Municipality)లోని మొత్తం 30 వార్డులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు అధికారికంగా ఖరారు చేశారు. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవిని ‘ఎస్సీ మహిళ’ కేటగిరీకి కేటాయించడంతో ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన, మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ రూపొందించిన ఈ జాబితాలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభించింది. వార్డుల వారీగా కేటాయింపులు గమనిస్తే, సామాజిక సమీకరణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్సీ(SC) సామాజిక వర్గానికి ఐదు వార్డులు (5, 6, 7, 9, 10, 30) కేటాయించగా, బీసీ(BC) వర్గాలకు ఏడు వార్డులు దక్కాయి. ఎస్టీ అభ్యర్థులకు ఒక వార్డు (15వ వార్డు) కేటాయించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల నిబంధన మేరకు అత్యధిక వార్డుల్లో మహిళా అభ్యర్థులు బరిలో నిలవనున్నారు.

వార్డుల వారీగా రిజర్వేషన్ల పూర్తి వివరాలు

పట్టణంలోని 1వ వార్డు జనరల్ మహిళకు కేటాయించగా, 2వ వార్డు బీసీ మహిళ, 3వ వార్డు జనరల్, 4వ వార్డు జనరల్ మహిళ, 5వ వార్డు ఎస్సీ మహిళకు ఖరారయ్యాయి. 6, 7 వార్డులను ఎస్సీ జనరల్‌కు, 8వ వార్డును జనరల్ మహిళకు, 9వ వార్డును ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. 10వ వార్డు ఎస్సీ మహిళ, 11వ వార్డు బీసీ జనరల్, 12వ వార్డు జనరల్, 13వ వార్డు జనరల్ మహిళ, 14వ వార్డు బీసీ జనరల్, 15వ వార్డు ఎస్టీ జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. అలాగే 16వ వార్డు జనరల్ మహిళ, 17వ వార్డు జనరల్, 18వ వార్డు జనరల్ మహిళ, 19వ వార్డు జనరల్, 20వ వార్డు జనరల్ మహిళకు కేటాయింపులు జరిగాయి.

Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా? లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా?

ఆశావహులు తమ తమ వార్డుల్లో

బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 21వ వార్డు బీసీ జనరల్, 22వ వార్డు బీసీ మహిళగా నిర్ణయించారు. 23వ వార్డు జనరల్ మహిళ, 24వ వార్డు జనరల్, 25వ వార్డు బీసీ మహిళ, 26వ వార్డు జనరల్ అభ్యర్థులకు కేటాయించారు. మిగిలిన వాటిలో 27వ వార్డు బీసీ మహిళ, 28వ వార్డు బీసీ జనరల్, 29వ వార్డు జనరల్ కాగా, చివరిదైన 30వ వార్డు ఎస్సీ మహిళకు దక్కింది. మున్సిపల్ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళకు కేటాయించడంతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు స్పష్టం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఆశావహులు తమ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రిజర్వేషన్ల ప్రకటనతో మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Also Read: Vande Bharat 4.0: త్వరలో వందే భారత్ 4.0.. వేగం గంటకు 250 కి.మీ.. మరిన్ని ప్రత్యేకతలు ఇవే!

Just In

01

Medak News: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకే పెద్దపీట

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని ఉంది..

Gadwal Municipality: గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. చైర్ పర్సన్..?

Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!

New District Demand: ప్రత్యేక జిల్లా సాధనకై గర్జించిన జేఏసీ.. భారీ ఎత్తున నినాదాలతో నిరహార దీక్ష..!