Press Meet Cancel: ఆసియా కప్-2025లో మరో వివాదం చోటుచేసుకుంది. గత ఆదివారం రాత్రి మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు తమకు హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడాన్ని పాకిస్థాన్ టీమ్ అవమానకరంగా ఫీలవుతోంది. అదే వ్యవహారాన్ని పట్టుకొని వేలాడుతోంది. ‘నో హ్యాండ్‌షేక్’ వివాదంలో భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ ప్రైకాఫ్ట్ పాత్ర ఉందని, ఆసియా కప్ నుంచి అతడిని తొలగించాలంటూ ఐసీసీకి పీసీబీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఐసీసీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడానికి నిరసగా కీలక ప్రెస్‌మీట్‌ను (Press Meet Cancel) పాకిస్థాన్ టీమ్ రద్దు చేసుకుంది.
బుధవారం రాత్రి యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒక రోజు ముందు, అంటే మంగళవారం ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరగాల్సి ఉంది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ జట్టు దానిని రద్దు చేసుకుంది. ‘హ్యాండ్‌షేక్’ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ, తమ అభ్యర్థనను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది. హ్యాండ్‌షేక్ వివాదంలో పైక్రాఫ్ట్ ముఖ్యపాత్ర పోషించారని పీసీబీ ఆరోపిస్తోంది.
Read Also- India – Pakistan: భారత్‌తో సైనిక సంఘర్షణపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ ఇప్పుడేమంటారో?
ఆండీ ప్రైకాఫ్ట్‌ను తొలగించకపోతే ఆసియా కప్ నుంచి వైదొలగుతామంటూ పాక్ చేసిన వ్యాఖ్యల పట్ల మీడియా నుంచి ప్రశ్నలు ఎదురవుతాయనే భయంతోనే పాకిస్థాన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేసుకొని ఉండొచ్చంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పాక్ టీమ్ వర్గాలు చెబుతున్నట్టు పేర్కొంటున్నాయి.
యథావిథిగా ప్రాక్టీస్
ప్రెస్ కాన్ఫరెన్స్ రద్దు చేసుకున్నప్పటికీ, పాకిస్థాన్ ఆటగాళ్లు యథావిథిగా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. నిజానికి, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించకపోతే యుఏఈతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, మ్యాచ్ రిఫరీని తొలగించకపోయినప్పటికీ ప్రాక్టీస్ చేస్తుండడం చూస్తుంటే, తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ, ఆసియా కప్‌లో కొనసాగుతుందా? లేదా, అన్న దానిపై పాకిస్థాన్ జట్టు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, టోర్నమెంట్ ఈ దశలో పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి వైదొలగే అవకాశం చాలా తక్కువని, ఎందుకంటే, టోర్నీ నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకుంటే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉంది. కాబట్టి, అసలే గడ్డుకాలంలో ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Read Also- India – Pakistan: భారత్‌తో సైనిక సంఘర్షణపై పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ ఇప్పుడేమంటారో?