No-Shakehand
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Handshake Controversy: ‘నో షేక్‌హ్యాండ్’ పరాభవం నుంచి బయటపడని పాక్.. కీలక అధికారిపై పీసీబీ వేటు

Handshake Controversy: ఆసియా కప్ 2025లో (Asia Cup 2025) భాగంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం (Handshake Controversy) తలెత్తిన విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్లకు భారత ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సీరియస్‌గా తీసుకొంది. ఈ వివాదాన్ని సరైన రీతిలో హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ క్రికెట్ డైరెక్టర్‌గా ఉస్మాన్ వహ్లాను పీసీబీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆయనను పదవి నుంచి తొలగించారని ‘ఏస్పోర్ట్స్’ కథనం పేర్కొంది.

Read Also- Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచల కామెంట్స్

మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తీరుపై అధికారికంగా ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని, అందుకు ఉస్మాన్ వహ్లా బాధ్యత వహించాల్సి వచ్చిందని కథనం పేర్కొంది. కాగా, ‘నో షేక్‌హ్యాండ్’ వివాదంపై పీసీబీ సోమవారం మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు హ్యాండ్‌షేక్ ఇవ్వవద్దంటూ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సూచించడాన్ని తప్పుపడుతూ ఫిర్యాదులో ఆరోపించింది. అయితే, మ్యాచ్ రిఫరీ ప్రవర్తన, భారత ఆటగాళ్ల చర్యల పట్ల అధికారిక స్పందన తెలియజేయడంలో ఆలస్యం జరిగిందని, అందుకు ఉస్మాన్ వహ్లా కారణమని పీసీబీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also- Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచల కామెంట్స్

మ్యాచ్ బాయ్‌కాట్ యోచనలో పాక్

కాగా, పాకిస్థాన్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్ తెగ ఫీలవుతోంది. క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించిన భారత ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేశామని, కానీ ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తోంది. ఆసియా కప్‌లో యూఏఈతో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా షెడ్యూల్ చేశారు. దీంతో, ఆయనను పక్కనపెట్టకుంటే ఆ మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ భావిస్తున్నట్టు కథనాలు పేర్కొంటున్నాయి. యుఏఈతో మంగళవారం ఆడాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ హెచ్చరిస్తోందని ‘క్రిక్‌బజ్’ కథనం పేర్కొంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టోర్నమెంట్‌ నుంచి తొలగించాలంటూ ఆ జట్టు డిమాండ్ చేస్తోందని, లేకుంటే యూఏఈతో మ్యాచ్‌ ఆడకూడదని భావిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వేకి చెందిన వ్యక్తి.

కాగా, భారత ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలుత మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్‌కి ఫిర్యాదు చేసింది. కానీ, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెబుతోంది. అందుకే, ఆయనను ఆసియా కప్ టోర్నమెంట్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తమ డిమాండ్‌ను తెలియజేస్తూ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌కి (ACC) లేఖ కూడా రాసినట్టుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Read Also- Fee Reimbursement: సర్కార్ రివర్స్ అటాక్.. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఝలక్!

Just In

01

Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!

Gold Shop Scams: బంగారం షాపులపై నిఘా ఏదీ?.. గుట్టుచప్పుడుకాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

Etela Rajender: ముఖ్యమంత్రులేం ఓనర్లు కాదు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు