Ramchander Rao(IMAGE CREDIT: SWTCHA REPORTER)
Politics

Ramchander Rao: ఫీజు రీయింబర్స్ మెంట్ పై సర్కార్ కు స్పష్టత కొరవడింది.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్

Ramchander Rao: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల నిర్ణయానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేక ప్రైవేట్ యాజమాన్యాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు.

తక్షణమే ఈ బకాయిలు మంజూరు చేయాలి

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత కొరవడిందని మండిపడ్డారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన సీఎం రూ.వందల కోట్లు రిలీజ్ చేస్తామని అన్నారని, కానీ రీయింబర్స్ మెంట్ బకాయిలు మాత్రం విడుదల చేయడంలేదని ఫైరయ్యారు. తక్షణమే ఈ బకాయిలు మంజూరు చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్షాన్ని ఆయన ఖండించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు రూ.8 వేల కోట్లు పైగా ఉన్నప్పటికీ, రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆయన విమర్శలు చేశారు. విద్యా వ్యవస్థను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు రిలీజ్ చేయడంతో పాటు కొత్త భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

 Also Read: OG Movie: ‘గన్స్ ఎన్ రోజెస్’ సాంగ్ వచ్చేసింది.. నో డౌట్, థమన్ రెడ్‌ బుల్ ఏసే ఉంటాడు!

ఇంజనీరింగ్, ఫార్మాసీ, ఎంబీఏ కాలేజ్‌ల బంద్…!

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ ల కాలేజీలు బంద్ అయ్యాయని సత్తుపల్లి బిజెపి నాయకులు పాలకొల్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సత్తుపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాలకొల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందన్నారు.

రూ.8000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్

రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా రూ.8000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందరని ఆరోపించారు.
ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటూ కేసిఆర్ ఏ విధంగా అయితే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెట్టాడో అదే మార్గాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నదని వెల్లడించారు. కళాశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్న ఈ సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా పేద విద్యార్థుల ఉన్నత విద్య పట్ల ఇంత చిన్నచూపు చూడడమే నిరవధిక బందుకు అసలు కారణమని పేర్కొన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలి

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే తరహాలో మొద్దు నిద్రలో ఉంటే విద్యార్థులతో కలిసి బిజెపి చేసే ఉద్యమాలకు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థుల తో చెలగాటం ఆడొద్దు అని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.

 Also Read: Jayammu Nichayammu Raa: డాడీ అని పిలిచిన తేజ సజ్జా.. ఫీలైన జగ్గూ భాయ్.. వీడియో వైరల్!

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?