Kora Movie
ఎంటర్‌టైన్మెంట్

Kora: ఊర మాస్ సినిమా రెడీ అవుతోంది.. ఇదే లేటెస్ట్ అప్డేట్!

Kora: మాస్ అండ్ యాక్షన్ సినిమాలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాదనలేని నిజం. అందుకే ‘పుష్ప’ వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నాయి. మాస్ యాక్షన్‌కి తగినట్లుగా మంచి కథ పడితే, ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు. ఇప్పుడలాంటి ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్, హై ఓల్టేజ్ యాక్షన్ మూవీనే రూపొందిస్తున్నారు దర్శకుడు ఒరాటశ్రీ. సునామీ కిట్టి హీరోగా దర్శకుడు ఒరాటశ్రీ రూపొందిస్తున్న హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కోర’. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్‌ని మేకర్స్ తెలిపారు.

Also Read- Telugu Directors: శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు దర్శకుల హవా!

చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌, పాటలు ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇటీవల ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రిలీజ్ చేసిన ‘ఒప్పుకుందిరో’ అనే పాట మంచి స్పందనను రాబట్టుకుంటూ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచింది. తాజాగా సినిమాకి సంబంధించిన మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే..

Also Read- Karate Kalyani: నోటీసులు పంపిస్తే.. తగ్గేదేలే.. హేమపై కరాటే కళ్యాణి ఫైర్!

ఏప్రిల్ నెలలోనే ‘కోర’ మూవీని విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో చిత్రయూనిట్ బిజీగా ఉందని, ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నట్లుగా ఈ అప్డేట్‌లో మేకర్స్ వెల్లడించారు. సినిమా అంతా బాగా వచ్చిందని, మాస్ అండ్ యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్‌ని ఈ సినిమా ఇస్తుందని, అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. ఈ అప్డేట్‌తో ఈ సినిమా వార్తలలో నిలుస్తోంది. అలాగే ఈ అప్డేట్‌తో పాటు హీరోహీరోయన్లు కలిసి ఉన్న పిక్స్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Samantha: ద క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు?

ఊర మాస్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా, బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ని ఓ రేంజ్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ‘కాంతార చాప్టర్ 1’కు, ‘ది రాజా సాబ్’కు ఉన్న లింకేంటి? నిర్మాత ఏం చెప్పారంటే?

Ritika Nayak: హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ క్యారెక్టర్.. ‘మిరాయ్’లో తన పాత్ర ఏంటో చెప్పేసిన హీరోయిన్

Mega Little Prince: మెగా లిటిల్ ప్రిన్స్‌.. రామ్ చరణ్, నిహారిక పోస్ట్‌లు వైరల్..!

Bellamkonda Sai Sreenivas: ‘కిష్కింధపురి’ చూశాను.. మైండ్ బ్లోయింగ్.. బెస్ట్ ఏంటంటే?

OG Movie: రికార్డ్స్ రాకుండా చేస్తున్నారంటూ.. ‘ఓజీ’ అమెరికా డిస్ట్రిబ్యూటర్లపై ఫ్యాన్స్ ఆగ్రహం!