Telugu Directors: ప్రస్తుతం ప్రపంచ సినిమా టాలీవుడ్ వైపు చూస్తుంది. అలా చూసేలా చేస్తున్నారు మన దర్శకులు, హీరోలు. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించే చిత్రాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ ప్రభంజనం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కటేమిటి? ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల రేంజ్ పాన్ ఇండియా వైడ్‌గా మోత మోగుతుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా వరకు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే రూపొందుతున్నాయంటే, టాలీవుడ్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సైతం మన తెలుగు సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు సినిమా స్థాయి ఆస్కార్ రేంజ్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇలా ఎటు చూసినా, తెలుగు సినిమా స్థాయి దినదినాభి వృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు.
Also Read- Karate Kalyani: నోటీసులు పంపిస్తే.. తగ్గేదేలే.. హేమపై కరాటే కళ్యాణి ఫైర్!
ఇప్పుడో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన తెలుగు దర్శకులు సత్తా చాటి.. మరోసారి టాలీవుడ్ గురించి మాట్లాడుకునేలా చేశారు. గత 3 ఏళ్ల నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- అయోధ్యలో మన తెలుగు రచయిత, దర్శకుడు అయిన సత్యకాశీ భార్గవ, యువ దర్శకుడు కృష్ణ ఎస్ రామ.. అవార్డ్స్ సొంతం చేసుకుని తెలుగువారు గర్వించేలా చేశారు.
Also Read- Samantha: ద క్వీన్ ఈజ్ బ్యాక్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు?
ఈ సందర్బంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ.. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగువారికి 4 అవార్డ్స్ రావడం చాలా ఆనందదాయకం అని చెబుతూ, ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమకి గర్వకారణమని అన్నారు. ‘రామ అయోధ్య’ ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. తన మొదటి చిత్రానికే ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం చాలా ఆనందంగా, గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. ‘రామ అయోధ్య’ ఫిల్మ్ 2024 ఏప్రిల్ 17న ఆహా తెలుగు ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంది. ‘శ్రీమాన్ రామ’ దూరదర్శన్ నేషనల్ టీవీలో 2024 లో రిలీజ్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతూ నెంబర్ -1 టీవీ షోగా రికార్డు సృష్టించింది.
Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!
శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- అయోధ్యలో తెలుగువారికి వచ్చిన అవార్డ్స్ ఇవే..
1) బెస్ట్ డైరెక్టర్ (యానిమేషన్)-సత్యకాశీ భార్గవ (శ్రీమాన్ రామ)
2) బెస్ట్ కార్టూన్ యానిమేషన్ ఫిల్మ్- శ్రీమాన్ రామ
3) బెస్ట్ మైధలాజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్- కృష్ణ ఎస్ రామ (రామ అయోధ్య)
4) బెస్ట్ కల్చరల్ స్టోరీ కాన్సెప్ట్ -సత్యకాశీ భార్గవ (రామ అయోధ్య)
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు