Ashwin Babu in Vachinavaadu Goutam
ఎంటర్‌టైన్మెంట్

Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!

Ashwin Babu: టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్సయింది. అశ్విన్ బాబు సినిమాలకు మొదటి నుంచి పవర్ ఫుల్ టైటిల్సే పడుతున్నాయి. ఆయన 9వ చిత్రానికి మరో పవర్ ఫుల్ టైటిల్‌ని సెట్ చేశారు. మామిడాల ఎం.ఆర్. కృష్ణ (Mamidala MR Krishna) దర్శకత్వంలో ప్రస్తుతం అశ్విన్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వచ్చిన వాడు గౌతమ్’ (Vachinavaadu Goutam) అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Also Read- Athammas Kitchen: అలేఖ్య పచ్చళ్ల కాంట్రవర్సీతో ‘అత్తమ్మాస్ కిచెన్’ ట్రెండింగ్‌లోకి.. మ్యాటర్ ఏంటంటే?

అంతేకాదు, టైటిల్‌తో పాటు ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ మూడవ చిత్రంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టైటిల్ పోస్టర్‌ (Vachinavaadu Goutam Title Poster)లో బ్లెడ్ అండ్ స్టెత్‌తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. అశ్విన్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సాయి రోణక్ (Sai Ronak) ఓ పవర్ ఫుల్ కేమియో పాత్రలో కనిపించనున్నారు.

అశ్విన్ బాబు సరసన రియా సుమన్ (Riya Suman) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, అభినయ, అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్, సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Also Read- Sreeleela: ఆకతాయిలు చేసిన పనితో శ్రీలీల షాక్.. పబ్లిక్‌లో అలా లాక్కెళ్లిపోయారేంటి? వీడియో వైరల్!

ప్రస్తుతం ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించి మిగిలివున్న షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ఇతరత్రా పనులు పూర్తి చేసి త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని తెలిపారు. ఇక అశ్విన్ బాబు కెరీర్‌కు ఈ సినిమా ఎంతో కీలకం. ఎందుకంటే, ‘రాజుగారి గది’ సిరీస్ చిత్రాల తర్వాత అశ్విన్ బాబుకు సరైన హిట్ మాత్రం లేదనే చెప్పుకోవాలి. అందుకే ఈ సినిమా హిట్టవడం ఆయనకు ఎంతో ముఖ్యంగా. చిత్రబృందం కూడా ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంది. మరి అశ్విన్ బాబు అనుకుంటున్న సక్సెస్‌ని ఈ ‘వచ్చినవాడు గౌతమ్’ ఇస్తాడేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!