Samantha
ఎంటర్‌టైన్మెంట్

Samantha: ద క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు?

Samantha: ఈ మధ్యకాలంలో తరుచూ వార్తలలో ఉండే పేరు ఎవరిదైనా ఉందీ అంటే, అది సమంత పేరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత, ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆమె పెట్టే పోస్ట్‌లు వైరల్ అవుతుండటంతో, ఆటోమ్యాటిగ్గా ఆమె పేరు వార్తలలో వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ‘ద క్వీన్ ఈజ్ బ్యాక్’ విషయానికి వస్తే..

Also Read- Virgin Boys: ‘బ్రో.. ఆర్ యు వర్జిన్?’.. పోస్టర్ అదిరింది

సోషల్ మీడియా ఇన్‌స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండే సమంత, ట్విట్టర్ ఎక్స్‌‌కి ఎప్పుడో గుడ్‌బై చెప్పేసింది. 2012లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన సమంత, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు యాక్టివ్‌గానే ఉంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన ట్వీట్స్ అన్ని డిలీట్ చేసి.. ట్విట్టర్ అకౌంట్‌ సైలెంట్‌లో పెట్టేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె అప్పటి ట్విట్టర్, ఇప్పటి ‘ఎక్స్’ ఖాతాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఫస్ట్ పోస్ట్‌ని కూడా పెట్టేసింది. దీంతో అందరూ ‘ద క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ సమంతకు స్వాగతం పలుకుతున్నారు.

ఇంతకీ సమంత రీ ఎంట్రీలో ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ ఏంటో తెలుసా? ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, నిర్మాతగా తన ఫేట్‌ని పరీక్షించుకోబోతుంది. ఈ క్రమంలో ఆమె ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో బ్యానర్ స్థాపించి, అందులో ఫస్ట్ చిత్రానికే ‘శుభం’ కార్డు వేసేస్తుంది. అర్థం కాలేదా.. ఫస్ట్ సినిమా టైటిలే ‘శుభం’ (Subham) అనే పేరుతో నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం సమంత తన రీ ఎంట్రీలో ఎక్స్‌లో మొదటి పోస్ట్ చేసింది. ‘బిగ్ డ్రీమ్‌తో.. మా చిన్న ప్రేమను మీముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఇది నాకు గొప్ప ప్రారంభం’ అని సమంత తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!

‘శుభం’ విషయానికి వస్తే.. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వసంత్ మరిగంటి రాసిన కథతో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటివారు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, భ‌య‌పెడుతూ, ఉత్కంఠ‌తను రేపే స‌న్నివేశాలతో, యూనిక్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తుతుందని మేకర్స్ చెబుతున్నారు. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ వేస‌విలోనే విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్ట్‌తో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు