Karate Kalyani vs Hema
ఎంటర్‌టైన్మెంట్

Karate Kalyani: నోటీసులు పంపిస్తే.. తగ్గేదేలే.. హేమపై కరాటే కళ్యాణి ఫైర్!

Karate Kalyani: సినీ నటి హేమ తనకు పంపించిన నోటీసులకు భయపడేదే లేదని అన్నారు నటి కరాటే కళ్యాణి. తాజాగా ఆమె హేమ పంపించిన నోటీసులపై ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో హేమ పంపించిన నోటీసులపై స్పందించారు. ఈ వీడియోలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ..

‘‘హేమ నాకు నోటీసులు పంపించారు. నేను నోటీసులకు భయపడతానని అనుకుంటుంది. ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే. నేను లీగల్‌గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హేమ నోటీసులు నాకు అందాయి. నాకు అబద్దం చెప్పడం రాదు. ప్రస్తుతం నేను విజయనగరంలో ఉన్నాను. హేమ పంపించిన నోటీసులపై నేను లీగల్‌గా ముందుకు వెళ్తాను. ఆ నోటీసులకు రిప్లై ఇస్తాను. నేను కూడా ఆమెకు నోటీసులు పంపిస్తాను. ఆమెపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదు.

Also Read- Samantha: ద క్వీన్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు?

‘మా’ ఎన్నికల సమయంలో కూడా నేను ఆమెకు మద్దతు ఇచ్చాను. నాపై రూ. 5 కోట్ల పరువు నష్టం వేస్తూ నోటీసులు పంపించింది. అయినా సరే ఎక్కడా తగ్గేదే లేదు. నేను భయపడతానని అనుకుంటుంది. నా తప్పు లేనప్పుడు నేనెవ్వరికీ భయపడేది లేదు. ధర్మం వైపే విజయం ఉంటుందని నమ్ముతాను నేను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

అసలు విషయం ఏమిటంటే.. గతేడాది బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదట్లో హేమ నేను అక్కడ లేను అనేలా కథలు అల్లినప్పటికీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా హేమను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత కొన్ని టెస్ట్‌లు చేయించుకుని, తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదనేలా రిపోర్ట్ వచ్చిందని చెబుతూ హేమ మీడియా ముందుకు వచ్చారు.

Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!

ఈ క్రమంలో హేమను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించినప్పుడు కరాటే కళ్యాణితో పాటు మరికొందరు ఆమెపై కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తి మమ్మల్ని ఎలా అంటుంది. ఆమెకు ఇండస్ట్రీలో ఉండే చోటు లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణితో పాటు కొన్ని యూబ్యూబ్ ఛానళ్లు కూడా ఆమెపై ప్రత్యేకంగా కొన్ని వీడియోలను రూపొందించాయి. ప్రస్తుతం హేమ తనపై యూట్యూబ్ వీడియోలు చేసిన వారిపై, అలాగే తన ప్రతిష్టకు, పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన కరాటే కళ్యాణి వంటి వారిపై చర్యలకు దిగింది. అందరికీ లీగల్ నోటీసులు పంపించింది. ఈ లీగల్ నోటీసులపైనే కరాటే కళ్యాణి ఇలా రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఈ అంశంపై టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఇంకా హేమ ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో అని అంతా మాట్లాడుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు