Lenin First Single: అక్కినేని యువ హీరో అఖిల్ తన కెరీర్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఫ్యాన్ ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్నందుకు ఫస్ట్ సింగిల్ ను జనవరి 5 2026న విడుదల చేయనున్నారు. దీంతో అయ్యగారు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడని అభిమానులు ఆసిస్తున్నారు. ఈ సినిమా వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలోని మొదటి సింగిల్ తేదీని విడుదల చేసి, సినిమాపై ఉన్న క్యూరియాసిటీని ఒక్కసారిగా పెంచేసింది. అఖిల్ కు ఇది ఆరో చిత్రంగా రాబోతుంది. సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Read also-Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
అఖిల్ కు ఇది ఆరో చిత్రంగా రాబోతుంది. ఈ సినిమాలో శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే కథానాయికలుగా నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా నవీన్ కుమార్ సినిమాటో గ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా కు నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. థమన్ ఉన్నాడంటేనే ఈ సినిమా మ్యూజిల్ పరంగా హిట్ టాక్ అవుతుందని అభిమానులు ఆసిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మరింత హైప్ పెంచాయి. న్యూయర్ సందర్భంగా దీనికి సంబంధించి పోస్టర్ ను విడుదలచేశారు. పోస్టర్ ను చూస్తుంటే.. మొదటి పాట్ వచ్చేది.. పండగ వాతావరణంలో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సంక్రాతి కి పాట విడుదవుతుండటంతో పాట్ హిట్ హిట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ పాట కోసం జనవరి 5, 2026 వరకూ ఆగాల్సిందే.
Read also-Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!
ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం ఏదీ లేదు’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని, అఖిల్ ఆ ప్రాంత యాసలో మాట్లాడబోతున్నారని వార్తలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో (తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో) నిర్మిస్తున్నట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2026 సమ్మర్ సీజన్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అఖిల్ తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
మరి కొత్త సంవత్సరంతో పాటు…
అదిరిపోయే పాట కూడా వచ్చేస్తుండాది..😉#LENIN First Single on Jan 5th 🔥Wishing you all a very Happy New Year ❤️🔥
In Cinemas Summer 2026. 🥳@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla… pic.twitter.com/pnFEz8oBUe
— Sithara Entertainments (@SitharaEnts) January 1, 2026

