Chevella Bus Accident: హైద్రాబాద్, బీజాపూర్ జాతీయ రహదారిలో ట్రాఫిక్ పెరిగిపోయింది. కానీ రోడ్డు వెడల్పు చిన్నది కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరొక ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఈ రోడ్డు వెడల్పుకు అడ్డం పడుతున్న పర్యావరణ వేత్తలు ఒక్కసారి ఇటు వైపు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. రోడ్డు ప్రమాదాలతో నిండు ప్రాణాలు కోల్పోతున్న కుటుంబ సభ్యుల ఆవేదన తీర్చగలమా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, రాజకీయ నాయకులు అందరూ ఇలాంటి సంఘటనలకు పూర్తి స్థాయి పరిష్కారం చేయాలని భాదిత కుటుంబాలు కోరుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read: Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి
శుభం తెలియని 15నెలల పాప మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. తాండూర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ డీకొట్టింది. దీంతో టిప్పర్ పూర్తిగా బస్సుపై పడిపోవడంతో డ్రైవర్ వైపు ఉన్న భాగం మొత్తం విరిగిపోయింది. అందులోని కంకర పూర్తిగా బస్సులో చేరిపోవడంతో ప్రయాణికులు మునిగిపోయి మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామ పరిధిలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో సుమారుగా 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అతివేగంగా కంకర లోడుతో వస్తున్న టిప్పర్ 15 మంది ప్రయాణికుల మృతికి కారణమైనట్లు తెలుస్తుంది. మరణించిన వారిలో అభం శుభం తెలియని 15నెలల పాప మృతి చెందడంతో ప్రమాద స్థలంలోని ప్రజలు కన్నీటి పర్వంతమైరు. ఆర్టీసీ డ్రైవర్ అక్కడిక్కడే చనిపోగా కండక్టర్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న మృతులను బయటికి తీసే సందర్భంలో స్థానిక సీఐ శ్రీధర్ కాళ్ళ పైకి జేసీబీ వెళ్లి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. కంకరతో నిండిన బస్సులోని మృతిదేహాలను, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
Also Read: Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్.. మృతుల్లో ఏడుగురు చిన్నారులు!
