Road Accident ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి

Road Accident: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మృతి చెందగా, కొందరి పరిస్థితి విమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ఘటలో టిప్పర్ డ్రైవర్ తో 17 మంది మృతి చెందారు. కొందమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Also ReadRajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది స్పాట్ డెడ్.. మృతుల్లో ఏడుగురు చిన్నారులు!

బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు

కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలుకళాశాలలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్టూడెంట్స్ అంతా ఆదివారం సెలవుకావడంతో ఇంటికి వెళ్లియ తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. క్రేన్ల సహాయంతో లారీ, బస్సులను పక్కకు జరిపి ట్రాఫిక్ను మామూలు స్థితికి తెచ్చారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో లారీ డ్రైవర్.. అధిక వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.

Also Read: Shadnagar Road Accident: షాద్ నగర్‌ లోఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి కూతురు స్పాట్ డెడ్!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్​ రెడ్డి  విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్​కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

Just In

01

Food Facts: ఆరోగ్యానికి మంచివే కానీ ఎక్కువైతే విషమం.. ఈ ఫుడ్ ఐటమ్స్ తో జాగ్రత్త!

GHMC: వచ్చే వార్షిక బడ్జెట్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. ఈసారి జరిగే మార్పులివే..!

Bigg Boss Telugu 9: తనూజ ఏం మారలే.. అవే అరుపులు.. నిజంగా బిగ్ బాస్ సపోర్ట్ ఉందా?

Devi Sri Prasad: ఆయన నా పాటకు స్టెప్పులెయ్యాలని కోరుకునేవాడిని.. దేవీ శ్రీ ప్రసాద్

Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు