School Controversy (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

School Controversy: పండుగ రోజు స్కూల్ లో పిల్లలకు బలవంతపు పాఠాలు.. ఎక్కడంటే..?

School Controversy: తొర్రూరు పట్టణ కేంద్రంలోని నలంద(Thorrur) స్కూల్(Nalanda School) వివాదం స్థానికంగా పెద్ద దుమారమే రేపింది. బతుకమ్మ పండుగ రోజు అమావాస్య నాడు విద్యార్థులను బలవంతంగా స్కూల్‌కు రప్పించి క్లాసులు నిర్వహించడం తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది. పండుగ రోజున కూడా పిల్లలకు పాఠాలు చెప్పడం వెనుక స్కూల్ యాజమాన్యం ర్యాంకుల కోసం అదనపు ఒత్తిడి అనే మైండ్‌సెట్ ఉన్నదని పలువురు ఆరోపిస్తున్నారు.

సంఘటన స్థలానికి డివిజన్ కమిటీ..

ఈ విషయంపై స్థానిక డివిజన్ కమిటీ వెంటనే స్పందించింది. ప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకుని నేరుగా ప్రిన్సిపాల్‌ను, ఎంఈఓ(MEO) బుచ్చయ్య(Butchaiah)ను నిలదీశారు.ప్రభుత్వం పండుగకు సెలవులు ప్రకటిస్తే, మీరెందుకు పిల్లలను ఇబ్బంది పెట్టారు..? అని వారిని ప్రశ్నించారు..? చివరికి కమిటీ ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులను ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎంఈఓ నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డ డాక్టర్ హుస్సేన్

హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మంగళపల్లి హుస్సేన్(Husen) తీవ్రంగా స్పందించారు.పండుగ పూట విద్యార్థులకు క్లాసులు పెడితే, మీరు టీచర్లకు కూడా క్లాసులు చెప్పాలి కదా..? మీ పిల్లలపై ఇలాంటి పరిస్థితి వస్తే మీరు ఊరుకుంటారా..? అంటూ ఎంఈఓ బుచ్చయ్యను నిలదీశారు. విద్యార్థులపై ఇంత అధిక ఒత్తిడి పెడితే వారి మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

Also Read: Gajwel flood: అక్రమ వెంచర్ల వల్లే రోడ్లు, కాలనీలు ముంపు.. బీజేపీ నేతల నిరసన

హ్యూమన్ రైట్స్ డివిజన్ ప్రెసిడెంట్..

హ్యూమన్ రైట్స్ డివిజన్ ప్రెసిడెంట్ పల్లెర్ల రమేష్ ఎంఈఓ వైఖరిపై మండిపడ్డారు. ప్రభుత్వం స్పష్టంగా సెలవులు ఇచ్చిన రోజునా నలంద స్కూల్ క్లాసులు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈఓ ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత బాధాకరం అని అన్నారు.స్థానిక నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పులు మళ్లీ పునరావృతం చేస్తే ఈ అంశాన్ని నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టే స్కూళ్లకు కఠిన శిక్షలు తప్పవు అని స్పష్టం చేశారు.

సైకాలజీ నిపుణుల సూచన

సైకాలజీ నిపుణులు చెబుతున్నట్లు పిల్లలకు చదువుతో పాటు వినోదం, ఆటలు(Games), పాటలు(Songs), పండుగలు కూడా అవసరం. ఇవి పిల్లల మెదడు వికాసానికి ఎంతో అవసరమని సూచిస్తున్నారు. కానీ ర్యాంకుల కోసం బలవంతపు క్లాసులు పెట్టడం వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొత్తం మీద తొర్రూరు(Thorrur)లో నలంద స్కూల్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. పండుగ పూట కూడా క్లాసులు పెట్టిన యాజమాన్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, నాయకులు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Panchayat Elections: స్థానికంపై సర్కార్ ‘వ్యూహాత్మకం’.. జిల్లా కలెక్టర్లకు కీలక సూచన

Just In

01

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

Etela Rajender: ముఖ్యమంత్రులేం ఓనర్లు కాదు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్‌తో కదిలిన విద్యాశాఖ.. ఎమ్మెల్యే పీఏగా పనిచేస్తున్న ఇంగ్లిష్ టీచర్‌పై విచారణ షురూ

Chinmayi Sripada: మంగ‌ళ‌సూత్రం కాంట్రవర్సీ.. ట్రోలర్స్‌పై చిన్మ‌యి ఫిర్యాదు