Panchayat Elections: జిల్లా కలెక్టర్ల నుంచి డేటా కోరిన ప్రభుత్వం
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై డెడికేషన్ కమిషన్ ఇచ్చిన ప్రకారం రిజర్వేషన్లు పూర్తి చేయాలి
4 రోజుల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లు చేసి పంపించాలని సూచన
ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ లిస్టు ప్రకటన
తాజాగా సీఎం సైతం ఎన్నికలపై సమీక్ష
ఇప్పటికే ఎన్నికలకు సన్నద్ధమైన పీఆర్
కలెక్టర్లతో సీఎస్ ఇంటర్నల్ వీడియో కాన్ఫరెన్స్!
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక ఎన్నికల నిర్వహణపై (Panchayat Elections) రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పకడ్బందీగా ముందుకెళ్లి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడంతో పాటు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగకుండా చర్యలు చేపడుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెడికేషన్ కమిషన్ నివేదికలో పొందుపర్చిన రిజర్వేషన్ల ఆధారంగా జిల్లావారీగా కల్పన చేయనున్నారు. అందుకు సంబంధించిన బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
కమిషన్ కమిషన్ చెప్పినదాని ప్రకారం రిజర్వేషన్లు అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. త్వరలోనే ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, రిజర్వేషన్లపై క్లారిటీకి రానున్నది. అందులో భాగంగానే ఇప్పటికే గ్రామాల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టును ప్రకటించారు. అయితే, ఆ ఓటర్ లిస్టు ప్రకారం వార్డుల వారీగా కులాల ప్రతిపాదికన ఓటర్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. నాలుగు రోజుల్లో వార్డు, గ్రామ, మండల స్థాయిలో రిజర్వేషన్లు పూర్తి చేసి పంపించాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది.
రాష్ట్రంలో 5,773 ఎంపీటీసీ స్థానాలు, 566 జడ్పీటీసీ స్థానాలు, 566 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 31 జడ్పీ స్థానాలు, గ్రామ పంచాయతీలు 12,777, వార్డులు 1,12694 ఉన్నాయి. అయితే, జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది. డెడికేషన్ కమిషన్ ఆధారంగా గ్రామాల్లో పంచాయతీల వారీగా కులాలవారీగా వివరాలను సేకరించి రిజర్వేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు సూచించింది.
గ్రామకార్యదర్శుల నుంచి వివరాలను డీపీవో సేకరించి కలెక్టర్లకు అందజేయనున్నారు. నాలుగు రోజుల్లోనే అందజేయాలని ఆదివారం సీఎస్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులో సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు. దీంతో అన్నిశాఖలు రెడీ అవుతున్నాయి.
Read Also- Pawan Kalyan OG concert entry: ‘ఓజీ’ కన్సర్ట్ కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన పవన్.. అక్కడ మాత్రం..
పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే బ్యాలెట్ల ముద్రణతో పాటు ఎన్నికలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సిద్ధం చేసుకున్నారు. రెండుమూడు దఫాలుగా ఉద్యోగులకు సైతం ఎన్నికల నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని ఇప్పటికే పంచాయతీరాజ్ ప్రకటించింది. ఇప్పటికే పంచాయతీ పాలక మండలి గడువు ముగిసిన ఏడాదిన్నరకు పైగా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేంద్రం సైతం పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేసింది. దీంతో మౌలిక సమస్యలు తిష్టవేశాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలకు సన్నాహాలు చేస్తుంది. అన్నిశాఖల అధికారులను అలర్టు చేస్తుంది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లను ఎలా చేయాలనే దానిపై అధికారులకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) సైతం ఇచ్చింది.
Read Also- Kashmir Issue: కాశ్మీర్‌పై పాక్ ప్రధాని షరీఫ్ అనూహ్య వ్యాఖ్యలు
బీసీ జనాభా ప్రాతిపదికన 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయబోతుండటంతో ఆశావాహులు పోటీకి ముందుకు వస్తున్నారు. జనరల్, రిజర్వేషన్లతో ఈసారి బీసీలకు ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తుండటంతో బీసీలు సైతం రాజకీయంగా రాణించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ల అమలుకు త్వరలోనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఏదీ ఏమైనా ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై కసరత్తును ప్రారంభించడం మంచి నిర్ణయం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.