Gajwel flood: అక్రమ వెంచర్లు చేసి చెరువుల కట్టు కాలువలను ధ్వంసం చేయడం వల్లే గజ్వేల్ (Gajwel )పట్టణానికి వరదనీటి ముప్పు ఏర్పడిందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ గజ్వేల్ Gajwel Flood) మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ పేర్కొన్నారు. ముఖ్య నాయకులుగా చెప్పుకుంటున్న వంటేరు ప్రతాపరెడ్డి, నర్సారెడ్డి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గజ్వేల్ లో శనివారం వరద నీటి ముంపు బాధిత కాలనీవాసులతో కలిసి పట్టణ బిజెపి నాయకులు గజ్వేల్- ప్రజ్ఞాపూర్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి వరద నీరు పారే కట్టు కాల్వలను వెంచర్ చేసి ధ్వంసం చేసినట్లు ఆరోపించారు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన జిల్లా గ్రంధాలయ చైర్మన్
కార్యాలయాలు వరద నీటితో ముంపు
బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ ప్రాంతంలో అక్రమ వెంచర్ ను ఏర్పాటు చేసి కట్టుకాలువలను ధ్వంసం చేయడంతో వరద నీరు కాలనీ మీదుగా ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తుందని తద్వారా పలు కాలనీలతో పాటు పెట్రోల్ పంపులు, ఇతర కార్యాలయాలు వరద నీటితో ముంపుకు గురవుతున్నట్లు ఆరోపించారు. ప్రతాప్ రెడ్డి పార్టీలు మార్చుతూ వెంచర్ లో కట్టుకాలువలను పునరుద్ధరించ కుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అలాగే ఎర్ర కుంట నిండితే మత్తడి వరద నీరు పాండవుల చెరువు చేరడానికి ఉన్న కట్టు కాలువను తూప్రాన్ రోడ్డుకు పెట్రోల్ పంపుల ఏర్పాటుతో పాటు వివిధ నిర్మాణాల వల్ల ఆ ప్రాంతం ముంపు కు గురవుతుందన్నారు. దీని వెనుక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రమేయం ఉన్నట్లు భాస్కర్ ఆరోపించారు.
ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది
మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఈ రెండు చెరువుల కట్టుకాలువలను వెంటనే పునరుద్ధరించాలని స్థానిక మున్సిపల్ ఇరిగేషన్ అధికారులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ ను కోరారు. అనేక సంవత్సరాలుగా ముంపుకు గురవుతున్న కాలనీవాసులతో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం, అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సిద్దిపేట బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, కమ్మరి శ్రీను, నత్తి శివకుమార్, జిల్ల రమేష్, వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, నరసింహ, ప్రసాద్, నాగులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: KTR: కర్ణాటక కాంగ్రెస్ దుర్మార్గపు నిర్ణయం.. తెలంగాణకు మరణశాసనం