KTR (imagecredit:twitter)
Politics

KTR: కర్ణాటక కాంగ్రెస్ దుర్మార్గపు నిర్ణయం.. తెలంగాణకు మరణశాసనం

KTR: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని మూడు రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు. కేవలం 100 టీఎంసీల కోసమే ఆల్మట్టి ఎత్తు పెంచడం లేదని, కృష్ణా జలాల్లోని తెలంగాణ హక్కును బొందపెట్టి ఉమ్మడి మహబూబ్ నగర్(Mahabubnagar), నల్గొండ(nalgonda), రంగారెడ్డి(Rangareddy)లను ఎడారులుగా మార్చేందుకు కర్నాటక కుట్ర పన్నిందని ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అక్కడా కాంగ్రెస్సే, ఇక్కడా కాంగ్రెస్సే అయినా తెలంగాణ రైతుల పొట్టగొడుతుంటే ఆపే ధైర్యం లేదా? అని రాష్ట్ర ప్ఱభుత్వాన్ని నిలదీశారు. ఈ కుట్రపై సీఎంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahulgandhi) తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి.. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, ఇక్కడి రైతులను బలిస్తారా? అని ప్రశ్నించారు. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను వెంటనే అడ్డుకోకపోతే రైతులతో కలిసి మహోద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు.

కేవలం ఐదు అడుగుల ఎత్తు

ఆల్మట్టి ఎత్తు పెంచితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు పనికిరాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో 90 శాతం పనులు పూర్తైన పాలమూరు రంగారెడ్డి పథకం నిర్వీర్యం అవుతుంటే పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ చూస్తూ ఊరుకోవడం దారుణమన్నారు. అంతేకాదు కర్నాటక(Karnataka) నుంచి కృష్ణా నీళ్లు రాకపోతే జూరాలే నిండదని, రేవంత్ మొదలుపెట్టిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా పడావు పడుతుందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను తిప్పికొట్టారు. కేవలం ఐదు అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే 70 వేల కోట్లు ఖర్చు చేయడంతో పాటు లక్షా 30 వేల ఎకరాలను భూమిని సేకరిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం చెపుతుందన్నారు. మరి 5 అడుగుల భూసేకరణకే అంత ఖర్చయితే, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, 1700 కిలోమీటర్ల కాలువలు.. 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 93 వేల కోట్ల ఖర్చు చేయడంలో తప్పేం ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని సరిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవధార అని స్పష్టం చేశారు.

Also Read; Rajasthan Shocker: దేశంలో ఘోరం.. ప్రియుడికి నచ్చలేదని.. బిడ్డను చంపేసిన తల్లి

మన రైతాంగ హక్కులు..

ఆల్మట్టి ఎత్తు పెంపు అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కృష్ణా(Krishna) వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్-II ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందన్నారు. ఎత్తు పెంపు తో మన రైతాంగ హక్కులు దెబ్బతింటాయని వాదించి స్టే తెచ్చిందని తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పోరాటాన్ని కొనసాగించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఆ స్టే కొనసాగేలా చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగానే కర్ణాటక సర్కారు ఇంత దుర్మార్గమైన నిర్ణయం తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఏపీకి ధారాధత్తం చేస్తున్న ఇప్పుడు కృష్ణా జలాలను కర్ణాటకకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం..

ఓట్ చోరీపై గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడే ఆయనకు ఓట్ల చోరీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పి, గల్లీలో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల దొంగతనం కనిపించకపోవడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు , ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అని విమర్శించారు. 

Also Read: Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?