Sharwa-and-Rakshitha
ఎంటర్‌టైన్మెంట్

Sharwanand: కాపురంలో కలహాలు.. శర్వానంద్ జంట విడాకులు తీసుకుంటున్నారా?

Sharwanand: టాలీవుడ్‌లో నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) విడాకుల వార్త ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో తెలియంది కాదు. ఇప్పుడు నాగ చైతన్య బాటలోనే యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) కూడా వెళుతున్నాడా? అంటే అవుననేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. శర్వానంద్, రక్షిత (Rakshitha)ల కాపురంలో కొంతకాలంగా కలహాలు చెలరేగాయని, వారిద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారనేలా వార్తలు వైరల్ అవడంతో పాటు, త్వరలోనే వారిద్దరూ విడాకులు తీసుకుబోతున్నట్లుగా కూడా టాక్ నడుస్తుంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు కానీ, టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం శర్వానంద్ విడాకులు అంటూ, ఓ రేంజ్‌లో వార్తలు సంచారం చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే..

Also Read- Vijay Deverakonda: ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు.. బండ్లకు కౌంటర్! ఇదెలా మిస్సయ్యారు?

విడివిడిగా ఉంటున్నారట

ఏపీ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షితా రెడ్డిని శర్వానంద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2023 జూన్‌లో జైపూర్, లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉన్న విషయం తెలిసిందే. మరి ఏ విషయంలో వీరిద్దరి మధ్య కలహాలు ఏర్పడ్డాయో తెలియదు కానీ, కొంత కాలంగా శర్వా, రక్షిత విడివిడిగా ఉంటున్నారట. వీరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకుల వరకు వెళ్లాయని, కానీ పెద్దలు జోక్యం చేసుకుని కొంతకాలం వేచి చూడండని సలహా ఇవ్వడంతో.. రక్షిత పుట్టింటికి వెళ్లిపోయిందని అంటున్నారు. వారికున్న పాపను కూడా కొన్నాళ్ల పాటు శర్వా, మరికొన్ని రోజుల పాటు రక్షిత చూసుకుంటున్నారని తెలుస్తోంది. పెళ్లయిన రెండు సంవత్సరాలకే ఇలా ఈ యువ జంట మధ్య కలహాలు రావడం, విడిపోయే వరకు వెళ్లడమనేది ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటున్నారు. చూద్దాం.. ఈ విషయం ఎప్పుడు బయటపెడతారో.. అసలు ఇందులో ఎలాంటి నిజం ఉందో..

Also Read- HCA Corruption: జగన్మోహన్​ రావు హెచ్​సీఏ అక్రమాలు పార్ట్ 7.. సంపత్ కుమార్​ విచారణతో వెలుగులోకి సంచలన నిజాలు

సినిమాలపై ప్రభావం

ఈ ఎఫెక్ట్ కారణంగా శర్వానంద్ సినిమాలు ఆలస్యమవుతున్నాయనేలా కూడా టాక్ మొదలైంది. ‘మనమే’ తర్వాత ఆయన నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. రెండు మూడు అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి. అందులో ‘నారి నారి నడుమ మురారి’ సినిమా మాత్రమే కొంత గ్యాప్ తర్వాత ఇటీవలే షూటింగ్ మొదలైందని అంటున్నారు. షూటింగ్ ప్రారంభం కావడంతో, సంక్రాంతికి విడుదల అంటూ మేకర్స్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కాకుండా సంపత్ నంది‌తో ‘భోగి’ అనే సినిమాను శర్వానంద్ ప్రకటించారు. ‘భోగి’ సినిమాతో పాటు అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వంలో శర్వానంద్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఆయన పర్సనల్ ఇష్యూ.. ఈ సినిమాల షూటింగ్స్‌‌కు ఎఫెక్ట్‌గా మారిందనేది వినిపిస్తున్న వార్తలలోని సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Hesham Abdul Wahab: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి నాకు స్ఫూర్తినిచ్చిన అంశమదే!

Gold Shop Scams: బంగారం షాపులపై నిఘా ఏదీ?.. గుట్టుచప్పుడుకాకుండా ఏం చేస్తున్నారో తెలుసా?

Konda Reddy Arrest Case: వైసీపీ విద్యార్థి నేత అరెస్టుపై ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించిన గుడివాడ అమర్నాథ్

Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

Etela Rajender: ముఖ్యమంత్రులేం ఓనర్లు కాదు.. ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు