Mosquito Menace (IMAGEb credit: TWITTER)
నార్త్ తెలంగాణ

Mosquito Menace: గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్న.. ప్రజలు తలుపులు తెరవాలంటేనే భయం

Mosquito Menace: గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది. గుంపులు గుంపులుగా పుట్టుకొస్తున్న దోమలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్రమైతే చాలు.. గ్రామల్లో ప్రజలు తలుపులు తెరవాలంటేనే భయపడిపోతున్నారు.

విజృంభిస్తున్న దోమలు…

వర్షాల కారణంగా వేగంగా వృద్ధి సాయంత్రం వేళల్లో కుప్పలుగా ఇళ్లల్లోకి నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం డెంగ్యూ, గున్యా వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం అధికార యంత్రం దోమలు నివారణ తీరుపై ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Boinapally Vinod Kumar: గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదు.. మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

గ్రామాల్లో జాడలేని ఫాగింగ్‌…

వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు వీధుల్లో ఫాగింగ్‌ చేపట్టకపోవడమే అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలం ప్రారంభమైందంటే గతంలో గ్రామ పంచాయతీలలో విరివిరిగా దోమల నివారణ చర్యలు చేపట్టేవారు. గ్రామపంచాయతీల్లో పాలకులు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలిసి కూడళ్లు, టైర్ల కొట్లు, డ్రైనేజీల్లో నీరు నిలువ ఉండకుండా చర్యలు చేప ట్టేవారు. కొబ్బరి బోండాల్లోనూ నీరు నిలువ ఉండకుండా వాటిని జనావాసాల నుంచి దూరంగా తరలించే వారు. ఇళ్లు, పరిసరాలతో పాటు నిర్మాణంలోని నీటి ట్యాంకులు, వ్యర్థాలు, పాత సామగ్రిని తనిఖీ చేసేవారు.

నీటి నిల్వలు తొలగించి, దోమల మందు పిచికారీ చేసేవారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో సహజంగానే బయటి వాతావరణంలో పలు రకాలుగా నీటి నిల్వలు పెరిగాయి. ముఖ్యంగా వినియోగంలో లేని కాళీ స్థలాలు మధ్యనే ఉండటం డ్రైనేజీలు చెత్తాచెదారం పేరుకుపోవడం దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల నివారణలో ఫాగింగ్‌ ప్రధానం. గ్రామపంచాయతీల పరిధిలో ఫాగింగ్‌ యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ వాటి సేవలను ఇంతవరకు వినియోగించిన దాఖలాలు లేవు పంచాయతీలు, పాలక వర్గాలు లేకపోవడం కూడా పారిశుధ్యం లోపించడానికి కారణమవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

క్లోరినేషన్‌ ఏదీ…?

ప్రజలు తాగే రక్షిత మంచినీటి ట్యాంకుల్లోనూ క్లోరి నేషన్‌ చేసిన దాఖలాలు కానరావడం లేదు. నిలువ నీరు ఉన్నచోట లార్వా వృద్ధి చెందే అవకాశాలు అనేకం ఉంటాయి. క్లోరినేషన్‌ చేయడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వీధు ల్లోని నాలాల్లో సైతం బ్లీచింగ్‌ చేసిన పాపాన పోవడం లేదు. నీరు నిలువ ఉండే చోట్ల బ్లీచింగ్‌ చేస్తే ఆదిలోనే లార్వా అంతమై దోమల బెడద తగ్గుతుంది. ఆ చర్యలు కూడా గ్రామాల్లో చేపట్టడం లేదు. దీంతో సా యంత్రం వేళ్లలో లైట్లు వేయగానే నాలాల్లో ఉన్న దోమలన్నీ ఇళ్లలోకి చేరుతున్నాయి. గుంపులు గుంపులు గా వస్తున్న దోమల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికన్‌ గున్యా లాంటి విష జ్వరాలు సోకుతాయి. ముఖ్యంగా పగలు కుట్టే దోమల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. అవి కుడితే డెంగ్యూ, చికన్‌ గున్యా వంటి తీవ్రమైన జ్వరాలు సోకుతాయి. వర్షాలు, వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆ స్పత్రులలో జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకూ పెరు గుతోంది. ప్రస్తుతానికి వైరల్‌ జ్వరాలతో ప్రజలు బాధ పడుతున్నప్పటికీ దోమల కారణంగా విష జ్వరాలు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయని కారణంగా నీరు కలుషితమై అతిసార ప్రభలే ప్రమాదం కూడా పొంచి ఉంది. అధికారుల వైఖరిపట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Nagababu: మెగా లిటిల్ ప్రిన్స్‌‌పై మెగా బ్రదర్ రియాక్షన్ ఇదే.. పట్టలేనంత ఆనందంలో!

Just In

01

Viral News: కారులోంచి దూకి ప్రియుడు మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాక్

YS Sharmila: నా బిడ్డ రాజకీయాల్లోకి వస్తే.. వైసీపీకి ఎందుకంత ఉలికిపాటు.. వైఎస్ షర్మిల

Warangal District: రజాకార్లపై విరోచితంగా పోరాడిన యోధుల గాధ.. స్వేచ్ఛ అందిస్తున్న ప్రత్యేక కథనం

Viral Video: బాత్రూం ఖాళీగా లేదా? ఈ పని చేయడానికి మెట్రోనే దొరికిందా!

only murders in the building season 5: కితకితలు పెట్టిస్తున్న థ్రల్లర్ సిరీస్.. ఎక్కడంటే?