Hydraa: పక్షుల కిలకిలరావాలు, వలసపక్షుల విహారంతో ఆహ్లాదంగా ఉన్న ప్రగతినగర్ (అంబీర్) చెరువు దుర్గంధభరితంగా మారింది. దీన్ని పునరుద్దరించే పనులపై హైడ్రా(Hydraa) ఫోకస్ పెట్టింది. వ్యర్థాల డంపిగ్ యార్డు(Dumping Yard)గా తయారై ఆహ్లాదం ఆనవాళ్లు లేకుండా పూయిన ఈ చెరువును పరిరక్షించేందుకు హైడ్రా నడుం బిగించింది. ఆహ్లాదం ఆవిరై, దుర్గంధభరితంగా మారిన చెరువును కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. చెరువు ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే పనులను సోమవారం ప్రారంభించింది. ఇప్పటికే 30 ట్రక్కుల చెత్తను తొలగించింది. మరో 30 ట్రక్కుల వరకూ ఉంటుందని అంచనా వేసింది. ఒకటి రెండు రోజుల్లో మొత్తం అక్కడి వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసింది. కూకట్‌పల్లి – ప్రగతినగర్‌లను కలుపుతూ ప్రగతినగర్ చెరువు మధ్యలోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలను తొలగించి భవిష్యత్తులో అక్కడ చెత్త వేయడానికి వీలు లేకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైడ్రా నిర్ణయించింది.
Also Read: Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు
స్థానికుల సహకారం
169 ఎకరాల వరకూ ఉండే ప్రగతినగర్ చెరువు ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభవించిన స్థానికులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్ ఏ బెటర్ సొసైటీ ప్రతినిధులు కూడా ఈ చెరువు పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ చెరువును కబ్జాల నుంచి కాపాడడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలని హైడ్రాను వీరంతా ఆశ్రయించారు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఇప్పటికే ప్రారంభించిన హైడ్రా స్థానికుల విజ్ఞప్తి మేరకు ప్రగతినగర్ చెరువు ప్రగతిపై దృష్టి పెట్టింది. చెరువులో నాన్ వెజ్ వ్యర్థాలు వేయకుండా నిఘా పెట్టింది. నాలుగు వెహికల్స్‌ను పట్టుకుని కేసులు కూడా నమోదు చేయించింది. సోమవారం వ్యర్థాలను తొలగించే పనులను పెద్ద ఎత్తున్న చేపట్టింది. ఫర్ ఏ బెటర్ సొసైటీ(For a better society) ప్రతినిధులతో పాటు స్థానికులు కూడా హైడ్రా(Hydraa)తో చేతులు కలిపారు. మరి కొద్ది రోజుల్లో పరిశుభ్రమైన వాతావరణం కనిపించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Seethakka: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత అందరిపై ఉంది : మంత్రి సీతక్క

